ముహుర్తబలం అంటారు. అలాగే అనిపిస్తోంది గుంటూరు కారం సినిమా పద్దతి చూస్తుంటే. మంచి బజ్ వున్న సినిమా. కేవలం డిజిటల్ హక్కులే నెట్ ఫ్లిక్స్ కు 80 కోట్లకు ముందే అమ్ముడుపోయిన సినిమా. దీనికి ఇంకా మరి కొన్ని రైట్స్ కలిపితే నాన్ థియేటర్ హక్కులు అవుతాయి. అంటే మహేష్ కెరీర్ హయ్యస్ట్. ఇవన్నీ పాజిటివ్ సైడ్. కానీ ఇదే సినిమాకు ఏదో ఒక సమస్య వస్తూనే వుంది.
ముందుగా ఇలా స్టార్ట్ చేసీ చేయగానే ఫైట్ మాస్టర్లను మార్చాల్సి వచ్చింది. చేసిన ఫైట్ సీక్వెన్స్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఆ తరువాత స్క్రిప్ట్ ను మార్చాల్సి వచ్చింది. కొత్త స్క్రిప్ట్ తో వర్క్ మొదలుపెట్టారు.
ఇలా రెండు అవాంతరాలు రావడం వల్ల విడుదల తేదీని మార్చాల్సి వచ్చింది.
అంతలో చేసిన ఓ షాపింగ్ మాల్ సీక్సెన్స్ సంతృప్తిగా లేదని దర్శకుడే పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. నిజమెంతో వారికే తెలియాలి.
ఇంతలో హీరోయిన్ పూజా హెగ్డే ను మార్చారు. మెయిన్ లీడ్ గా శ్రీలీలను మార్చి, మీనాక్షిని సెకెండ్ లీడ్ చేసారు.
ఇవన్నీ సెట్ అయ్యాయి అనుకుంటే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారు. ఆయన సమస్యలు ఆయనవి. ఆయన ప్లేస్ లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. కానీ ఆయన ఓజి లో బిజీగా వున్నారు.
ఇవన్నీ ఇలా వుంచితే మ్యూజిక్ డైరక్టర్ థమన్ పేరు ఇంకా డోలాయమానంగానే వుంది. వాహిబ్ ను (ఖుషీ ఫేమ్) ను తీసుకుంటారని వినిపిస్తోంది.
దీంతో నెటిజన్లు రకరకాల జోక్ లు వేస్తున్నారు. ఫ్యాన్స్ పాపం దిగాలు పడుతున్నారు.