హీరోయిన్ త్రిష సినిమాల్లోకొచ్చి చాలా ఏళ్ళయ్యింది. సినిమాల్లోకి రాకముందు టీవీ యాడ్స్‌తోపాటు ఫాల్గుణి పాఠక్ అల్బమ్స్లోనూ నటించింది. తన స్థాయికీ గ్లామర్‌కీ తగ్గ పాత్రలే వేసింది. మంచి జోష్‌లో వున్నప్పుడు రోడ్ల మీద ఫ్రెండ్స్‌తో మందు కొట్టి అల్లరి పాలయ్యింది కూడా.
అలాంటి త్రిష ‘లయన్’ సినిమాలో బాలకృష్ణ పక్కనే ఇంకా పెద్దదానిలా కనిపించింది. త్రిషకు గ్లామర్ తగ్గిపోయి చాలా ఏళ్ళయ్యింది. అయినాసరే ఇంకా కుర్ర హీరోలతో నటించాలనే ఉద్దేశ్యం ఇంకా మనసులో వుందట. బాలకృష్ణతో నటించడానికి త్రిష వెనుకా ముందూ ఆలోచించిందట.
వేషాల్లేక ఒప్పుకుందిగానీ, ఎప్పుడో విజయశాంతితో బాలకృష్ణ నటించేనాటికి త్రిష పుట్టనే లేదట. హీరోలకు ముసలితనం వచ్చినా లైఫ్ వుంటుంది. హీరోయిన్లకు అలా కాదుగా. గట్టిగా పది సంవత్సరాలు నిలబడితే గొప్ప. ఇకముందయినా త్రిష తన అత్యాశను పక్కన పెట్టి రాజశేఖర్, జగపతిబాబు, వెంకటేష్ లాంటి వాళ్ళతో ఆఫర్స్ వస్తే వదులుకోవడం మూర్ఖత్వమే మరి.