రామ్ గోపాల్ వర్మ ఏమంటారు…అంతా నా ఇష్టం అంటారు. అదేంటి అలా ట్వీట్ చేస్తారు..కొందరి మనోభావాలు దెబ్బ తినవా అంటే నాఇష్టం..నా అభిప్రాయం అంటారు. కానీ అదే జర్నలిస్టులు, ఇలా తెలుస్తోంది అని రాస్తే మాత్రం, నన్ను అడగక్కరలేదా? నా అభిప్రాయం తీసుకోరా..టాట్ ఇది ఎల్లో జర్నలిజం అంటారు.
హిందూ దేవుళ్ల మీద తన చిత్తానికి ట్వీట్ చేసినపుడు ఏ మత పెద్దల దగ్గర ఆర్జీవీ క్లారిఫికేషన్ తీసుకున్నారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై వచ్చిన వార్త విషయమే తీసకుందాం..ఇది వార్తగా కాకుండా, ఎవరో ఒకరు..ఆర్జీవీ..ఫలానా స్టార్ తో పోర్నో సినిమా తీస్తారేమో? లేదా తీస్తారా? అని ట్వీట్ చేస్తే ఏ విధంగా అభ్యంతరం తెలుపగలరు? ఎందుకంటే ఎవరి ట్వీట్ వారి ఇష్టం కదా..ఆయన ఉద్దేశం ప్రకారం? అద్దాల గదిలో వుండి అవతలి వారిపై రాళ్లేస్తే ఇదే సమస్య.