వారెవ్వా.. వాట్‌ ఏ థ్రిల్‌.!

క్రికెట్‌లో అసలు సిసలు మజా ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటిదాకా ఎవరూ చూడలేదేమో. దాదాపుగా చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగానే జరిగిపోయాయి. ఒకటీ అరా మ్యాచ్‌లు ఉత్కంఠ లేపినా, పసికూనలు ఐర్లాండ్‌, యూఏఈ తలపడ్డ మ్యాచ్‌ని…

క్రికెట్‌లో అసలు సిసలు మజా ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటిదాకా ఎవరూ చూడలేదేమో. దాదాపుగా చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగానే జరిగిపోయాయి. ఒకటీ అరా మ్యాచ్‌లు ఉత్కంఠ లేపినా, పసికూనలు ఐర్లాండ్‌, యూఏఈ తలపడ్డ మ్యాచ్‌ని మించిన థ్రిల్లింగ్‌గా ఈ వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఇంకే మ్యాచ్‌ జరగలేదనడం అతిశయోక్తి కాదేమో.!

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ని ఆదిలో దెబ్బ కొట్టింది బౌలింగ్‌తో ఐర్లాండ్‌. క్రమంగా తేరుకున్న యూఏఈ చివర్లో భారీగా పరుగులు పిండుకుంది. ఆరో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ అన్వర్‌ సెంచరీ బాదాడు. అమ్జాద్‌ అలీ, ఖుర్రమ్‌ ఖాన్‌, చివర్లో వచ్చిన అమ్జాద్‌ జావెద్‌ తప్ప యూఏఈ జట్టులో ఎవరూ రాణించలేకపోయారు. అన్వర్‌ సెంచరీ పుణ్యమా అని యూఏఈ ఏకంగా 278 పరుగులు చేసింది.

ఈ వరల్డ్‌ కప్‌లో ఆల్రెడీ సంచనాలకు తెరలేపిన ఐర్లాండ్‌, యూఏఈపై పెద్దగా తడబాటు ప్రదర్శించలేదుగానీ, చివర్లో టపటపా వికెట్లు పారేసుకుంది. ఐర్లాండ్‌ జట్టులోనూ ఆరో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ విల్సన్‌ 80 పరుగులు చేస్తే, ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ ఒబ్రెయిన్‌ వేగంగా అర్థసెంచరీ చేసి, జట్టును విజయపథాన నడిపించాడు. చివర్లో కాస్సేపు ఉత్కంఠ నెలకొంది.

పదునైన బౌలింగ్‌తో చివర్లో ఐర్లాండ్‌కి ముచ్చెమటలు పట్టేలా చేసింది యూఏఈ. అయినప్పటికీ, విజయం ఐర్లాండ్‌నే వరించింది. చివరి నాలుగైదు ఓవర్ల మ్యాచ్‌ చూస్తే, పెద్ద టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డట్టే తయారైంది పరిస్థితి. అయితే ఫీల్డింగ్‌ వైఫల్యంతో యూఏఈ మ్యాచ్‌ని చేజార్చుకోవడం, ఐర్లాండ్‌కి కలిసొచ్చింది.

పూల్‌`బిలో వున్న ఐర్లాండ్‌, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఐర్లాండ్‌ విజయం సాధించడం విశేషం. ఈ పూల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లనూ గెలిచి మంచి రన్‌రేట్‌తో టాప్‌ ప్లేస్‌లో వుంది టీమిండియా. ఆ తర్వాతి స్థానం వెస్టిండీస్‌ది. వెస్టిండీస్‌ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండిరటిని గెల్చుకుంది. ఒకదాంట్లో ఓటమి చవిచూసింది. అది కూడా ఐర్లాండ్‌ చేతిలోనే కావడం గమనార్హం.