ఆ పాట నాకెంతో పేరు తెచ్చింది.. ఇంకేం కావాలి?

కొన్ని ఇళ్ళు మాధుర్యానికి లోగిళ్ళు అన్నట్లుగా కొన్ని పాటలు చాలు మనం చిరస్థాయిగా నిలబడిపోవడానికి అని చెబుతుంది అందాల భామ హంసానందిని. ఈఇడ ఆనందానికి కారణం అయిన ఆ సాంగ్‌ ‘మిర్చి’ సినిమాలోనిది. ‘మిర్చి…

కొన్ని ఇళ్ళు మాధుర్యానికి లోగిళ్ళు అన్నట్లుగా కొన్ని పాటలు చాలు మనం చిరస్థాయిగా నిలబడిపోవడానికి అని చెబుతుంది అందాల భామ హంసానందిని. ఈఇడ ఆనందానికి కారణం అయిన ఆ సాంగ్‌ ‘మిర్చి’ సినిమాలోనిది. ‘మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రడే..’ అంటూ హంసా నందిని చిందేస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 

తనకు పేరు తెచ్చిన ఆ పాట గురించి చెబుతూ.. ఆ పాటలో అప్పుడు ఎర్రటి ఎండలో మిర్చ్‌యార్డ్స్‌లో నటించడానికి ఎంతో కష్టపడ్డాను. ఆ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా చాలామంది డాన్సులేస్తున్నారు. ఆడియో ఫంక్షన్స్‌లో కూడా అదే పాటను ఎంచుకుని నర్తిస్తున్నారు. ఇక ఆర్కెస్ట్రాల్లో, దాబాల్లో క్లబ్‌ల్లో ఎక్కడ చూసినా ఇప్పటికీ ఆ పాట నానుతూనే వుంది. అలాంటి పాటలో నటించినందుకు నాకు ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 

ఇక ముందు కూడా అలాంటి పాటల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే అది పెద్ద సినిమా అయ్యుండాలి. ఇక నటన పరంగా కన్నడలోనూ, తమిళంలోనూ కొన్ని సినిమాలు చేస్తున్నాను. మిర్చిలాంటి కుర్రాడే పాటలో డాన్సులు చేయమని కొన్ని విదేశీ సంస్థల వాళ్ళూ అడుగుతున్నారు. అంత హిట్‌ అయిన సాంగ్‌లో నేను మళ్ళీ పేలవంగా డాన్సులు చేయడం బాగుండదు. ఏదైనా పెద్ద వేదిక వున్నప్పుడు ఖచ్చితంగా చేస్తానంటోంది హంసా నందిని.