పెళ్ళవ్వలేదుగానీ వ్యవహారం కరెక్టేనట

ఆడా మగా కలవడానికి పెళ్ళి అవ్వాలనేది ఇప్పుడెక్కడుంది. ప్రేమించుకున్న వాళ్ళంతా నిజంగా పెళ్ళి చేసుకుంటున్నారా? ఫ్లాస్‌ బ్యాక్‌లు లేని జంటలు అసలున్నాయా? నిప్పు లేనిదే ఊరికే పొగ రాదు కదా. ముద్దుగుమ్మ నయనతార మాత్రం…

ఆడా మగా కలవడానికి పెళ్ళి అవ్వాలనేది ఇప్పుడెక్కడుంది. ప్రేమించుకున్న వాళ్ళంతా నిజంగా పెళ్ళి చేసుకుంటున్నారా? ఫ్లాస్‌ బ్యాక్‌లు లేని జంటలు అసలున్నాయా? నిప్పు లేనిదే ఊరికే పొగ రాదు కదా. ముద్దుగుమ్మ నయనతార మాత్రం పొగ ఊరికే వచ్చింది అసలు నిప్పే లేదంటుందిప్పుడు. ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో దెబ్బతిని ఇప్పుడు  ఎంతో జాగ్రత్తగా ప్రేమించిన ప్రేమికుడు గణేష్‌ శివ అనే దర్శకుడితో తనకయితే పెళ్ళి కాలేదనీ, అంతా మీడియా పెట్టిన చిచ్చే అని స్వయంగా పత్రికలకు చెప్పింది. 

ఓకే, పెళ్ళి కాలేదు.. నయనతారని విశ్వసిద్దాం.. మరి ఆయనతో వున్న లవ్‌ నిజం కాదా? లవ్‌ అన్నాక ఎన్నో కలయికలు వుంటాయి.. అవన్నీ నిజం కాదా? ఈ విషయంలో మాత్రం నయనతార నోరు విప్పడంలేదు. ఆ దర్శకుడితో మాల్దీవులకు ఎందుకు వెళ్ళినట్లు? చేయబోయే సినిమాకు లొకేషన్‌ చూడాలంటే డైరెక్టరూ, సినిమాటోగ్రాఫరూ వెళతారు. హీరోయిన్‌ వెళ్ళదు కదా. 

తమ మధ్య ప్రేమ వుంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పెళ్ళి అనేది సెకెండరీ మ్యాటర్‌. ఇద్దరి మధ్య వ్యవహారం గురించే క్లారిటీ లేక జనం గోల పెడుతున్నారు. తన కొత్త  ప్రియుడి మీద నమ్మకం లేకే నయనతార నోరు విప్పడంలేదేమో.!