ప్రకాష్ రాజ్ కు కృష్ణవంశీకి మాంచి అనుబంధం వుంది. అది మధ్యలో కాస్త బెడిసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి మళ్లీ గోవిందుడు సినిమా కోసం ప్యాచప్ చేసారు. తనికెళ్ల భరణి, కృష్ణవంశీ వంటి ఇంటలెక్చ్యవల్స్ అంటే ప్రకాష్ రాజ్ కు చాలా ఇష్టం. అందుకే మళ్లీ ఈ బంధం చిగురించిన సందర్భంగా, ఓ చిన్న సినిమా తీయాలని చూస్తున్నాడని వార్తలు వినవస్తున్నాయి.
కృష్ణవంశీతో చెప్పిన ఓ పాయింట్ ఆధారంగా చిన్నసినిమా తీస్తే ఎలా వుంటుందన్న దానిపై ప్రస్తుతం ప్రకాష్ ఆలోచిస్తున్నారట. ఎన్టీఆర్ కు పాయింట్ చెప్పినా, ఆ సినిమా పట్టాల ఎక్కడానికి ఇంకా టైమ్ పడుతుంది కాబట్టి, ఈ లోగా ఓ చిన్న సినిమా లాగించేయాలన్నది కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ ప్లాన్.