వర్మను మీడియా వెలేయాల్సిందే

పిచ్చి ముదిరింది..తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికి ఓ పెద్దమనిషి. ఇప్పుడు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అలాగే తయారవుతోంది. నానాటికీ తీసికట్టు నామం బొట్టు అన్నట్లు..బాలీవుడ్ స్థాయికి ఎగిసి..అక్కడి నుంచి తాను…

పిచ్చి ముదిరింది..తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికి ఓ పెద్దమనిషి. ఇప్పుడు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అలాగే తయారవుతోంది. నానాటికీ తీసికట్టు నామం బొట్టు అన్నట్లు..బాలీవుడ్ స్థాయికి ఎగిసి..అక్కడి నుంచి తాను మళ్లీ రానని చెప్పిన టాలీవుడ్ కే చేరారు. 

కాస్త పెద్ద సినిమాలు చేసి, ఆక్కడి నుంచి చిన్న సినిమాలకు జారి, ఆపై షార్ట్ ఫిలిం వరకు వచ్చారు. తను ఎక్కిన మెట్లన్నీ తానే దిగుతూ వస్తున్నారు. ఇవన్నీ ఆయన పర్సనల్ వ్యవహారాలు..కానీ ఇటీవల ఆయన తరచు చేస్తున్న ట్వీట్ లు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. 

భావప్రకటనా స్వేచ్ఛ వుందన్నది వాస్తవమే కానీ, ప్రజల మనోభావాలు కూడా గమనించాలి. వినాయకుడిపై అవాకులు, చవాకులు ట్వీట్ చేయడం, ఇప్పుడు దేవుళ్లను సైతం తెలంగాణ, ఆంధ్ర అని విభజించడం చూస్తుంటే, ఏమనాలో అర్థం కావడం లేదు. ఇక వర్మ ట్వీట్ చేసినా, కామెంట్ చేసినా వదిలేయడం ఒక్కటే మీడియా చేయాల్సింది. ఆ రోజు ఎప్పడు వస్తుందో.