అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూలాలు ఆఫ్రికాలోని కెన్యా దేశానివి అని వేరే చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు అదే కెన్యా నుంచి ఆయన కూతురుకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఇంకా పదేహారేళ్ల వయసులోనే ఉన్న ఒబామా పెద్ద కూతురు మాలియాను పెళ్లి చేసుకోవడానికి నైరోబీకి చెందిన ఒక లాయర్ ముచ్చటపడుతున్నాడు. అలాగిలాగా కాదు.. ఎదురు కట్నం ఇచ్చి మరీ ఆమెను పెళ్లి చేసుకొంటానని ఈ లాయర్ ప్రకటన చేయడం విశేషం.
ఆ ఎదురుకట్నం ఏమిటో కూడా చెప్పేసి.. తన ప్రపోజల్ ను మరింత ఆసక్తికరంగా మార్చుకొన్నాడతను. 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు.. ఇవీ ఒబామా ఇంటికి కట్నంగా పంపిస్తానని నైరోబీకి చెందిన ఫిలిక్స్ కిప్రోనో అనే లాయర్ ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. తను ఒబామా కూతురిని అమితంగా ప్రేమిస్తున్నానని.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను అని అతడు చెప్పాడు.
ఆమెతో వైవాహిక జీవితాన్ని సాగించాలని ఉందని.. అందుకే ఈ ప్రపోజల్ ను వారి ముందుకు తెస్తున్నట్టుగా ఆ లాయర్ ప్రకటించాడు. మరి ఒబామా కూతురు స్థాయి ఏమిటి? ఈ గొర్రెలు.. మేకలు ఏమిటి? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. అయితే ఆ లాయర్ కు మాత్రం ఇది అభ్యంతకరమైన విషయం అనిపించడం లేదు. అతడు ఆమెపై ప్రేమలో ఉన్నాడు కాబట్టి.. ఇది గొప్ప ప్రతిపాదనగానే కనిపిస్తుంది. తనకు ఒబామా ఆస్తులేమీ వద్దని.. ఈఎదురుకట్నమే ఇస్తానని అతడు చాలా గొప్పగా చెప్పుకొంటున్నాడు.
మాలియాను పెళ్లి చేసుకొని కెన్యాలో వ్యవసాయం చేసుకొంటూ.. ఆమెకు అవులు, మేకలతో పాలు పితకడం నేర్పించి.. అలా అలా జీవితాన్ని గడిపేయాలన్నది ఇతగాడి అందమైన కల. మరి అది మేరకు నెరవేరుతుందో చూడాలి!