పచ్చమీడియా.. అజ్ఞానపు రాతలు కారుకూతలు!

‘‘మీరు అవసరం కోసం అద్దెకారు మాట్లాడుకుంటే, ఉన్న సొంత కారును అమ్మేస్తున్నారనే సంకేతం వెళుతుందా.? మీరు సొంతకారు తెగనమ్మేస్తున్నారని అంటే మీకెలా ఉంటుంది?’’ అలా అన్నవాడికి  పిచ్చా అనిపిస్తుందా? లేదా? ఇప్పుడు పచ్చమీడియా పరిస్థితి…

‘‘మీరు అవసరం కోసం అద్దెకారు మాట్లాడుకుంటే, ఉన్న సొంత కారును అమ్మేస్తున్నారనే సంకేతం వెళుతుందా.? మీరు సొంతకారు తెగనమ్మేస్తున్నారని అంటే మీకెలా ఉంటుంది?’’ అలా అన్నవాడికి  పిచ్చా అనిపిస్తుందా? లేదా? ఇప్పుడు పచ్చమీడియా పరిస్థితి కూడా అదే తీరుగా ఉంది. నిద్దర్లేస్తే జగన్ సర్కారును బద్నాం చేయడానికి ఏ అబద్ధాల్ని వండి వారుద్దామా అనే ఆలోచనతో సతమతం అయిపోతూ ఉండే పచ్చ మీడియా.. తాజాగా ఆర్టీసీ మీద పడింది. 

ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకుని.. ఆ సంస్థ ఉద్యోగుల జీవితాలకు జగన్ ఒక భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, అదే ఉద్యోగుల్లో అభద్రతను పెంచడానికి కుట్రరచన చేస్తున్నది పచ్చ మీడియా!

ప్రజలకు మరింత మెరుగైన రవాణా వసతులు కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సుల అవసరం ఉన్నదో ఆర్టీసీ ఇటీవల అన్ని డిపోల నుంచి వివరాలు సేకరించింది. సుమారు 1600కు పైగా బస్సులు అవసరం కాగా.. 998 బస్సులు ప్రైవేటువి అద్దెకు తీసుకోడానికి ఆర్టీసీ టెండర్లు పిలిచింది. ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకుంటే ఆటోమేటిగ్గా.. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల బాధ్యత మొత్తం ప్రెవేటు యజమానులదే అవుతుంది. ఆర్టీసీ అద్దెబస్సులు తీసుకోవడం కొత్త కాదు. 

అయితే అద్దెబస్సులు రావడంతోటే ఆర్టీసీలో 2000 డ్రైవరు ఉద్యోగాలు పోతాయని, ఆర్టీసీని పూర్తిగా ప్రెవేటు పరం చేసేయడానికి ఇది ఒక అడుగు అని.. ఇలా రకరకాల ఊహాగానాలతో, వక్రబుద్ధులతో కూడిన కథనాన్ని పచ్చమీడియా వండి వార్చింది. ఈ కథనం నిండా ఊహలు, అవాస్తవాలు ఆర్టీసీకి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసేస్తున్నట్లుగా అన్యాపదేశంగా ఆరోపణలు.. ఇలా నానా చెత్తా రాసేశారు. 

ఆర్టీసీ ఎండి స్వయంగా పచ్చమీడియా కక్కిన విషాన్ని ఖండించాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రెవేటు బస్సుల శాతం పెరుగుతోందనేది ఆ కథనాల్లో సారాంశం. అందుకు నిబంధనలు సవరించారనేది వారికి కనిపించిన లోపం. కనీసం అదొక్క పాయింట్ రాసి ఉంటే సరిపోయేది. మొత్తం సంస్థ ప్రెవేటు పరం అయిపోతున్నట్టుగా అతి రాతలు రాశారు. నవ్వులపాలయ్యారు. 

నిజానికి ఇప్పటికిప్పుడు అవసరానికి తగినంతగా కొత్త బస్సులు కొనే స్థోమత సంస్థకు లేదని ఎండీ అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆర్టీసీ అసలు ప్రెవేటు బస్సులు కూడా అద్దెకు తీసుకోకుండా.. ఉన్న బస్సులతో తీసికట్టు సేవలు అందిస్తే ఈ మీడియా ఏం చేస్తుంది. 

ప్రజలు ఎలాగైనా చావనీ అనుకుంటుందా? కొత్తగా వచ్చే బస్సులకు వచ్చే ఉద్యోగాలు ప్రెవేటు వారివి కావడాన్ని చూపి.. సంస్థలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలే పోతున్నట్లుగా వక్ర రాతలు రాయడం ఆ మీడియాకే చెల్లింది. అందుకే ఇప్పుడు సంస్థ ఉద్యోగుల సానుభూతి కూడా లేకుండా నవ్వుల పాలు అవుతోంది. 

ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే వారి మొహానే బురద పడ్డట్టుగా పరిస్థితి తయారవుతోంది.