మొత్తానికి పవన్ మాట నిలబెట్టుకునేటట్లే వుంది. గోపాల గోపాల సమయంలో దర్శకుడు డాలీకి మాటిచ్చాడు. మరో సినిమా చేస్తానని. అందుకే ఇప్పుడు దాసరి నిర్మించే సినిమాను డాలీ చేతిలో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Advertisement
అయితే డైరక్షన్ ఇవ్వడానికి ఓకేనా. కానీ అందుకు అనువైన స్క్రిప్ట్ దొరకాల్సి వుంది. అందుకే ఇటీవల కాస్త పేరు తెచ్చుకున్న మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ తో కలిసి డాలీ ఓ స్క్రిప్ట్ తయారీకి పూనుకున్నట్లు వినికిడి. అది కనుక అటు పవన్ కు ఇటు దాసరికి ఓకె అయితే గబ్బర్ సింగ్ తరువాత పట్టాలమీదకు వస్తుంది.