మహేష్‌ హీరోయిన్‌ అలా అనేసిందేంటీ.?

‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేష్‌ సరసన ఆడి పాడిన అందాల భామ కృతి సనన్‌కి ఫ్రాంక్‌నెస్‌ కాస్త ఎక్కువే. ఎవరు ఎలాంటి ప్రశ్న సంధించినా ఠక్కున సమాధానం చెప్పేస్తుంది. డేటింగ్‌ గురించి అడిగినా, లవ్‌…

‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేష్‌ సరసన ఆడి పాడిన అందాల భామ కృతి సనన్‌కి ఫ్రాంక్‌నెస్‌ కాస్త ఎక్కువే. ఎవరు ఎలాంటి ప్రశ్న సంధించినా ఠక్కున సమాధానం చెప్పేస్తుంది. డేటింగ్‌ గురించి అడిగినా, లవ్‌ గురించి అడిగినా అస్సలేమాత్రం మొహమాటపడకుండా చెప్పడంలో కృతి సనన్‌ తర్వాతే ఎవరైనా.

డేటింగ్‌ ఇప్పుడున్న ట్రెండ్‌లో పెద్ద విషయమే కాదని చెప్పే కృతి సనన్‌, అందరిలా తనకు డేటింగ్‌, లవ్‌ గురించి ఇంట్రెస్ట్‌ లేదనే అబద్ధాలు చెప్పడం చేతకాదట. ఒకప్పుడు డేటింగ్‌ చేశాననీ, ఇప్పుడు మాత్రం ఖాళీ దొరక్క, అలాంటి విషయాలకు దూరంగా వున్నానని నిర్మొహమాటంగా చెప్పింది కృతి సనన్‌. ఇంతకీ డేటింగ్‌ ఎవరితో చేసినట్టు? అనడిగితే, అదిప్పుడు అప్రస్తుతం.. అని సమాధానాన్ని దాటవేసింది.

బాలీవుడ్‌లో కృతి సనన్‌ ‘హీరోపంతి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరో ఎవరో కాదు, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ (తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు) తనయుడు టైగర్‌ ష్రాఫ్‌. ఈ సినిమా టైమ్‌లోనే టైగర్‌ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగిపోయింది కృతిసనన్‌. అప్పట్లో వీరిద్దరి మధ్యా డేటింగ్‌ వ్యవహారం బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. 

అప్పట్లో పెద్దగా అవకాశాల్లేకపోవడంతో డేటింగ్‌ని ఎంజాయ్‌ చేసిందేమో. ఇప్పుడు మాత్రం, వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. అందుకే డేటింగ్‌, లవ్‌కి తీరిక లేదని చెబుతోంది కృతి సనన్‌. తెలుగులో ఇటీవలే నాగచైతన్యతో ‘దోచెయ్‌’ సినిమాలో కృతి నటించిన విషయం విదితమే.