బాహుబలి భారీ వ్యయంతో తయారవుతున్న సినిమా. అందులో అణుమాత్రం సందేహం లేదు. అయితే ఈ సినిమాకు చాలా వరకు ప్రచారం మాత్రం ఫ్రీగానే వస్తోంది. ఇంతవరకు ప్రచారానికి పైసా ఖర్చు చేసినట్లు కనిపించలేదు. మీడియానే బాహుబలి వార్త అని అనిపిస్తే చాలు ఆవురావురుమంటూ పాఠకులకు అందిస్తోంది.
సోషల్ మీడియాను బాహబలి టీమ్ బ్రహ్మాండంగా వాడుకుంటోంది. ఇప్పుడు అడియో ఫంక్షన్ ప్రసారం చేసే హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయి. అయినా ఆ ఫంక్షన్ కు కూడా ఖర్చు వీలయినంత తగ్గించుకోవాలని చూస్తున్నట్లుంది.
ఏంకర్ గా నానిని అడిగారు..ఆయన ఓకె అన్నాడు. రాజమౌళి అడిగితే కాదంటాడా? పైగా బాహుబలి ఫ్రభాస్ బ్యానర్ యువి క్రియేషన్ లో సినిమా కూడా చేస్తున్నాడాయె. అంటే మరో లేడీ ఏంకర్ వుంటుందో వుండదో? మరి దానికి ఇంకెవరినైనా సెట్ చేస్తారో?