ఏక్లా కపూర్‌ది పబ్లిసిటీ స్టంటేనా?

తాను తెరెకక్కిస్తోన్న ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’ సినిమా కోసం లేడీ సినిమాటోగ్రాఫర్‌ని పెట్టుకుందట ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్. లేడీ సినిమాటోగ్రాఫర్.. అని ప్రత్యేకంగా చెప్పుకోడానికి పెద్ద కారణమే వుంది. ఏక్తాకపూర్ సినిమాలంటే ఈ మధ్య…

తాను తెరెకక్కిస్తోన్న ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’ సినిమా కోసం లేడీ సినిమాటోగ్రాఫర్‌ని పెట్టుకుందట ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్. లేడీ సినిమాటోగ్రాఫర్.. అని ప్రత్యేకంగా చెప్పుకోడానికి పెద్ద కారణమే వుంది. ఏక్తాకపూర్ సినిమాలంటే ఈ మధ్య థర్డ్ గ్రేడ్ అడల్ట్ కంటెంట్ సినిమాలేనన్న అభిప్రాయం ఆడియన్స్‌లో బలపడిపోయింది. అలాంటి సినిమాలే ఆమె నిర్మిస్తోంది కూడా.

‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’ సినిమా టైటిల్‌తోనే సినిమాలో కంటెంట్ ఏంటో అర్థమయిపోతోంది కదా. లిమిట్ దాటిన హాట్ సీన్స్ సినిమాలో చాలానే వుంటాయట. హీరోయిన్ మీద తీస్తోన్న సన్నివేశాలైతే ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ లేనంత హాట్‌గా వుండబోతున్నాయని యూనిట్ సభ్యులే చెబుతున్నారు. అలాంటి సీన్స్‌లో హీరోయిన్లు ఏమాత్రం మొహమాటపడకుండా వుండేందుకే ఏక్తాకపూర్, లేడీ సినిమాటోగ్రాఫర్‌ని పెట్టిందట. 

మొన్నటికి మొన్న అనురాగ్ కశ్యప్ కూడా, రాధికా ఆప్టేతో ఓ హాట్ షార్ట్ ఫిలిం తీస్తూ, లేడీ క్రూనే దానికోసం వినియోగించాడు. హీరోయిన్లు కూడా ఇబ్బంది పడేంత హాట్ సీన్స్ ఎందుకు తీయాల్సి వస్తోంది.? పైగా లేడీ అయి వుండీ అలాంటి సినిమాల్నే ఎందుకు ఏక్తాకపూర్ ఇష్టపడ్తోంది.? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్కటి మాత్రం నిజం. లేడీ సినిమాటోగ్రాఫర్ అంటూ ఏక్తాకపూర్ పబ్లిసిటీ స్టంట్ చేస్తోంది. గతంలో ఆమె సినిమాలకు అవసరం లేని లేడీ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకే అవసరమయ్యిందంటే పబ్లిసిటీ స్టంట్ కాక మరేమిటి?