మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్ లకు మహా పేరు. చాన్నాళ్ల తరువాత ఆయన స్టెప్ లు వేసేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 22,23,24 తేదీల్లో చిరంజీవి డ్యాన్ చేసే సాంగ్ ను చిత్రీకరించడానికి డిసైడ్ అయ్యారు.
అయితే గమ్మత్తు ఏమిటంటే చిరు పక్కన చిందులేసే చిన్నదాని పేరు ఇంకా ఖరారు కాలేదు. రెండు పేర్లు ఫైనల్ లిస్ట్ లోకి వచ్చాయి. మిల్కీ బ్యూటీ తమన్నా, హవర్ గ్లాస్ ఫిగర్ ఇలియానా..ఈ ఇద్దరిలో ఒకరు కావచ్చు. చిరు చేత వీణ స్టెప్ వేయించడమే కాకుండా, ఇంకా అనేక మాంచి హిట్ డ్యాన్స్ మూమెంట్ లు ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ మరోసారి తన సత్తా చాటబోతున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి పది నిమషాలు సేపు కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఓ పాట వుంది..ఫైటు వుంది. ముందుగా పాటను పిక్చరైజ్ చేస్తారు. తరువాత ఫైట్..ఎక్కడ షూట్ చేస్తారు, సెట్ ఎక్కడ వేసారు అన్నది ఇంకా తెలియాల్సి వుంది. అన్నపూర్ణ అని వినికిడి.