ఖడ్గం సినిమాను గుర్తు చేస్తున్న హీరోయిన్ తల్లి..!

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సినిమా ఇండస్ట్రీ గురించి సున్నితంగా స్పృశించారు. ఆ సినిమాలో హీరోయిన్ కావాలని తపిస్తూ కనిపించే సంగీత పాత్ర, కూతురును హీరోయిన్ గా చూసుకోవాలనే తల్లి పాత్ర ద్వారా…

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సినిమా ఇండస్ట్రీ గురించి సున్నితంగా స్పృశించారు. ఆ సినిమాలో హీరోయిన్ కావాలని తపిస్తూ కనిపించే సంగీత పాత్ర, కూతురును హీరోయిన్ గా చూసుకోవాలనే తల్లి పాత్ర ద్వారా .. ఇండస్ట్రీలో పరిస్థితులకు అద్దం పట్టారు కృష్ణవంశీ.

ఎంతగా ప్రయత్నించినా హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో కూతురుని నిర్మాత, దర్శకుల పడక గదుల్లోకి వెళ్లేలా ప్రేరేపిస్తుంది ఒక తల్లి. మరి కృష్ణవంశీ లాంటి దర్శకుడు అలా చూపించే సరికి నిజంగానే.. ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం ఉంటుందా? అని అనేక మంది ఆశ్చర్యపోయారు. అలాంటి వ్యవహారాలను నమ్మకుండా ఉండటానికి లేదు.. నమ్మకపోవడానికీ లేదు.

నైతికంగా ఆలోచిస్తే ..ఎంతైనా కూతురును అలా తయారు చేసే తల్లి ఉంటుందా? అనే సందేహం వస్తుంది. అయితే ఇండస్ట్రీ లోని అంతర్గత పరిస్థితుల గురించి పరిశీలిస్తే మాత్రం కృష్ణవంశీ చూపింది అబద్ధం కాదనే అనుకోవాల్సి వస్తోంది.ప్రత్యేకించ పది సంవత్సరాలకు పైగా కెరీర్ ను కలిగిన ఒక హీరోయిన్ తల్లి ప్రవర్తన విస్మయం కలిగించే విధంగా ఉంటోంది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయి… వెనుకబడిపోయిన కూతురుతో ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారమే చేస్తోంది ఆ తల్లి.

ఆసక్తి ఉన్న నిర్మాతలకు, బడా పారిశ్రామిక వేత్తలకు కూతురి కంపెనీని అందిస్తూ ఆమె వ్యాపారం చేస్తోంది. కూతురుని అడ్డం పెట్టుకొని ఒక్కో రాత్రి డేటింగ్ కంపెనీకి  పది లక్షల రూపాయలను వసూలు చేస్తోంది ఆ హీరోయిన్ తల్లి. మరి ఇలాంటి వాళ్లను చూసే కృష్ణవంశీ తన సినిమాలో అలాంటి పాత్రను సృష్టించాడని అనుకోవాల్సి వస్తోంది. ఇండస్ట్రీలో నైతిక విలువలు అనేవి ఏ మాత్రం పట్టింపులేనివని అనుకోవాల్సి వస్తోంది.