నారా రోహిత్ కెరీర్ మరింత పీక్ కు వెళ్తోంది. చేతిలో మూడు సినిమాలు రన్నింగ్ లో వున్నాయి.. రెండు సెట్ ల మీదకు వెళ్లాల్సి వుంది. ఇందులో కార్తికేయ నిర్మాత శ్రీనివాస్ నిర్మించే సినిమా అక్టోబర్ 24న క్లాప్ కొట్టుకుంటుంది. ఇదిలావుంటే ఇప్పుడు వారాహి చలన చిత్ర పతాకంపై నారా రోహిత్ తో రెండు సినిమాలు నిర్మించేందుకు సాయి కొర్రపాటి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ రెండింటికి వినాయక చవితి రోజున పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. వీటిలో ఒకదానికి అవసరాల శ్రీనివాస్ డైరక్టర్ గా వ్యవహరిస్తారు. ఊహలు గుసగుసలాడే సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ రూపొందించే సినిమా ఇది. దీనికి మళ్లీ కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తారు. దీనికి జ్యో అచ్యుతానంద అని టైటిల్ పెడతారని వినికిడి.
సాయి కొర్రపాటి నిర్మించే రెండో సినిమాకు కొత్త దర్శకుడు పని చేస్తారు. అవసరాల సినిమా అయిన వెంటనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. మొత్తం మీద నారా రోహిత్ చేతిలో ఇప్పుడు ఏడు సినిమాలు చేరాయి.