త్రివిక్రమ్..మళ్లీ అదేనా?

తెగ హడావుడి మొదలైంది త్రివిక్రమ్ సినిమా అ..ఆ పేరు ప్రకటించిన తరువాత. త్రివిక్రమ్ ఫ్రెష్ సినిమా చేస్తున్నాడని, ఇలా అని, అలా అని..కానీ కథ గా అయితే ఈ సినిమా పెద్దగా కొత్త లైన్…

తెగ హడావుడి మొదలైంది త్రివిక్రమ్ సినిమా అ..ఆ పేరు ప్రకటించిన తరువాత. త్రివిక్రమ్ ఫ్రెష్ సినిమా చేస్తున్నాడని, ఇలా అని, అలా అని..కానీ కథ గా అయితే ఈ సినిమా పెద్దగా కొత్త లైన్ ఏమీ కాదని తెలుస్తోంది.

అయితే కథనం మాత్రం, అవుట్ అండ్ అవుట్ త్రివిక్రమ్ స్టయిల్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుందట. జనం పడీ పడీ నవ్వాల్సిందేనని టాక్. కానీ కథ మాత్రం మళ్లీ ఇటీవల ట్రెండ్ అయిన 'బంధాలు కలుపుకోవడం' టైపు కథే అని తెలస్తోంది. కానీ క్రిటిక్స్ ఎలా అన్నా, తన మార్కుతో జులాయి, సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాలు హిట్ చేసుకున్నాడు త్రివిక్రమ్.

ఇప్పుడు అదే భరోసాతో అ..ఆ సినిమాకు కూడా డిసైడ్ అయ్యాడట. అన్నట్లు ఈ సినిమా టైటిల్ బాలీవుడ్ సినిమా (లడ)క, (లడ)కీ నుంచి ఇన్ స్పయిర్ అయ్యాడని అప్పుడు వార్తలు వినిపించడం ప్రారంభించాయి.