వ్యాపారాలు, సినిమాలు మార్చేసిన బిబిఎమ్

ఒక్కో సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే చాలు, టాలీవుడ్ లో జనాల ఆలోచనా ధోరణి మారిపోతుంది. వ్యాపార పరిణామాలుమారిపోతాయి. బాహుబలి, శ్రీమంతుడు కలెక్షన్లు పెద్ద సినిమాల ధీమాను పెంచితే, భలే భలే మగాడివోయ్…

ఒక్కో సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే చాలు, టాలీవుడ్ లో జనాల ఆలోచనా ధోరణి మారిపోతుంది. వ్యాపార పరిణామాలుమారిపోతాయి. బాహుబలి, శ్రీమంతుడు కలెక్షన్లు పెద్ద సినిమాల ధీమాను పెంచితే, భలే భలే మగాడివోయ్ సినిమా మీడియం సినిమాలకు ధైర్యాన్నిచ్చింది.

పైగా ఆ సినిమా ఓవర్ సీస్ లో కొల్ల గొట్టిన కలెక్షన్లు చూసి, ఇప్పుడు ఓవర్ సీస్ హక్కుల కోసం పోటీలు పెరిగిపోయాయట. ఇది ఇమ్మీడియట్ గా కొన్ని సినిమాల మీద ప్రభావం చూపించిందని తెలుస్తోంది.

అలా లబ్ది పొందిన సినిమాలో నిఖిల్-కోనవెంకట్ ల 'శంకరాభరణం' కూడా వుందట. ఓవర్ సీస్ వ్యాపారం బాగుందని, అక్కడ దగ్గర వాళ్లున్న మన సినిమా జనాలు ఇప్పుడు ఆ వ్యాపారంపై దృష్టి పెడుతున్నారట.

వ్యాపారం సంగతి అలా వుంచితే, నిర్మాణంలో వున్న కొన్ని సినిమాలు స్క్రిప్ట్ లు కూడా మార్చుకుంటున్నాయని వినికిడి. లాజిక్ లు, మాజిక్ లు తరువాత, జనాన్ని ఎలా ఎంటర్ టైన్ చేయాలన్నదే కీలకం అని డిసైడ్ అయ్యారట. ఆ మేరకు స్క్రిప్ట్ దశలో వున్న కొన్ని సినిమాలు తమ దిశను మార్చుకుంటున్నాయట. మొత్తానికి మారుతి బిబిఎమ్ చాలా మార్పులే తెచ్చింది.