ఇంటికి జెష్ఠ, పొరుక్కి లక్ష్మి అని వెనకటికి ఓ సామెత వుంది. అంటే ఇంట్లో వాళ్లకు పనికి రాదు, పక్కవాళ్లకి పనికి వస్తుందనే మీనింగ్ తో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇలాగే వుండేలా వుంది. తన ఇంట్లో వాళ్లు ఏ ఫంక్షన్ చేసినా ఆయన రాడు. అది అందరికీ తెలిసిందే. కానీ వేరే రాజకీయనాయకులు ఎక్కడికన్నా పిలిస్తే వెళతారు. అదేం చిత్రమో?
మొన్నటికి మొన్న చిరు బర్త డే ఫంక్షన్ లో నాగబాబు కూడా ఇదే విషయమై సీరియస్ అయ్యాడు. మేం పిలిస్తే వాడు రాడు..ఎందుకు రాడో మాకు తెలియదు..అని అన్నాడు. ఇప్పుడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ సినిమా కంచె అడియో ఫంక్షన్ కు పవన్ ను పిలిచారని, కానీ రావడం లేదని వార్తలు వినిపించాయి. చరణ్ వస్తా అన్నాడని కూడా టాక్.
కానీ ఇప్పుడు అఖిల్ అక్కినేని నటించిన అఖిల్ సినిమా అడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని వార్తలు వినవస్తున్నాయి. ఆ సినిమా నిర్మాత, హీరో నితిన్ సాక్షాత్తూ పవన్ కు వీరాభిమాని. పైగా అక్కినేని జయంతి రోజున జరుగుతున్న కార్యక్రమం అందుకే పవన్ వస్తున్నాడని తెలుస్తోంది.
కానీ ఇలా ఇంట్లో వాళ్ల ఫంక్షన్ కు హాజరు కాకుండా, బయటవాళ్ల ఫంక్షన్ లకు హాజరయితే దగ్గర బంధువుల మనసులు గాయపడవా? పైగా ఇది వ్యాపారం. పవన్ వస్తే ఆ సినిమాకు వచ్చే హైపే వేరు. మరి ఆ హైప్ తనవాళ్ల సినిమాలకు వద్దని పవన్ అనుకుంటున్నాడా? ఏమో?