ఆమె మొన్నటి వరకూ ఒక హీరో ప్రేమలో ఉండేది. ఇద్దరూ కలిసి అనేక చోట్ల కనిపించారు. శ్రీకాళహస్తికి కూడా జంటగా వెళ్లి పూజలు చేయించుకొని వచ్చారు. అయితే ఏమైందో కానీ.. వారిద్దరి బంధానికీ బ్రేక్ వచ్చింది. ఎవరికి వారు అయ్యారు. ఆ హీరో ఇప్పడు అంత ఫామ్ లో కూడా లేడు. ఈ హీరోయిన్ మాత్రం తెలుగు, తమిళ భాషల్లో యమ బిజీగా బిజీగా కనిపిస్తోంది. చేతినిండా సినిమాలున్నాయి. మరి ఇంత బిజీగా కనిపిస్తున్న ఆమె ఇప్పుడు మరో హీరో ప్రేమలో సేదతీరుతోందని తెలుస్తోంది!
ఆ హీరోతో కలిసి ఇప్పటికే నటించింది ఆమె. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో కావడంతో అతడికి హిట్స్ తో సంబంధం లేకుండా చేతిలో సినిమాలున్నాయి. ఆ హీరోపై ఈ హీరోయిన్ కు మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది! తాజాగా ఆ హీరోయిన్… తనకు ఇష్టమైన వాటి గురించి చెబుతూ… ఆ హీరో పేరు స్టార్ట్ అయ్యే అక్షరంపై అమితంగా ప్రేమను వ్యక్త పరిచింది. ఆ అక్షరమంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చింది! ఈ విధంగా అతడిపై ఆమె ప్రేమను పరోక్షంగా కమ్ బహిరంగంగా వ్యక్తపరిచిందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.
ఆ అక్షరంపై ఎందుకంత ప్రేమ అంటే మాత్రం “నో కామెంట్'' అంటూ తప్పించుకొంటోంది కానీ.. ఆ ప్రేమ అలా దాచేస్తే దాగదనే అభిప్రాయాలు వినిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వీరి డేటింగ్ రహస్యంగానే సాగుతోంది. అది వెలుగుచూడడం మాత్రం కష్టమేనేమో!