జయనన్ సమస్య దర్శకత్వమా?

దాదాపు డెభై సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ట్రాక్ రికార్డు, సినిమా రంగంలో సుమారు నలభై ఏళ్లపాటు సంపాదించిన అనుభవం, వెరసి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ ను దర్శకత్వం దిశగా నడిపిస్తున్నాయి.…

దాదాపు డెభై సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ట్రాక్ రికార్డు, సినిమా రంగంలో సుమారు నలభై ఏళ్లపాటు సంపాదించిన అనుభవం, వెరసి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ ను దర్శకత్వం దిశగా నడిపిస్తున్నాయి.

హీరో గోపీచంద్ తో జయనన్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం వుంది. మలయాళ చిత్ర రంగానికి చెందిన జయనన్, తండ్రి, సోదరుడు కూడా సినిమాటోగ్రాఫర్లే. పవన్ బద్రి, తీన్ మార్, గబ్బర్ సింగ్, గోపాల గోపాల అన్నింటికీ జయనన్ సినిమాటోగ్రఫీ అందించారు.

దర్శకుడు బాబి పని చేసిన బలుపు, పవర్ లకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్. మరి ఎక్కడ తేడా వచ్చిందో, ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. బాబితో వివాదం అని ఒక వెర్షన్ వినిపిస్తుంటే, కాదని, సినిమాపై డిసెంబర్ దాటాక వుండలేనని, జనవరి నుంచి తాను డైరక్ట్ చేసే సినిమా మీదకు వెళ్లాల్సి వుంటుందని, మందే కండిషన్ పెట్టాడని కూడా తెలుస్తోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ నత్తనడక చూసి, తన వల్ల కాదని సున్నితంగా చెప్పి,తప్పకున్నట్లు ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఇప్పుడు జయనన్ సోదరుడినే సర్దార్ గబ్బర్ సింగ్ కు సినిమాటోగ్రాఫర్ గా ఎంపిక చేస్తున్నట్లు వినికిడి.