సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మల్టీ టాలెంటెడ్..ఆయన కేవలం సంగీత దర్శకుడే కాదు. మంచి డ్యాన్సర్ కూడా.యువతకు నచ్చే మంచి పాటల రచయితగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటికే.దేవీ రాసిన పాటలన్నీ సూపర్ హిట్ లే. ఇప్పుడు దేవీలోని కొత్త యాంగిల్ ఇంకోటి బయటకు వస్తోంది. అదే కొరియోగ్రఫీ.
దేవీ తనకు అత్యంత ఆప్తుడైన సుకుమార్ కోసం ఓ చిన్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అదే కుమారి 21ఎఫ్. రాజ్ తరుణ్ హీరో. ఈ సినిమా కోసం దేవీ స్వయంగా ఓ పాటకు డ్యాన్స్ డైరక్షన్ చేసాడట. విదేశాల్లో ఈ పాట చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ పాటకు సంబందించిన ప్యాచ్ వర్క్ ను ఒక్క రోజు క్రితం హైదరాబాద్ లో ఫినిష్ చేసాడట.
నిజంగా రెండు సినిమాల వయస్సున్న రాజ్ తరుణ్ అదృష్టవంతుడు. టాప్ హీరోల సినిమాలకు మాత్రమే సంగీతం అందించే దేవీ సంగీతం ఇవ్వడమే కాకుండా, కొరియోగ్రఫీ చేయడం. దేవీ కొరియోగ్రఫీ చేసిన పాట హిట్ అయితే, ఇక హీరోల సినిమాల్లో దేవీ స్పెషల్ సాంగ్ లు వంటాయేమో?