ఆ రచయితకు.. ఆ హీరోయిన్ కు ఉన్న అనుంబంధం గురించి ఇండస్ట్రీలో అనేక రూమర్లున్నాయి. ఆమెకు ఆయన బాగా సన్నిహితుడని.. ఎంత సన్నిహితుడంటే.. ఆమెతో డేట్ కావాలనుకొనే వారు ఆయనను సంప్రదిస్తే చాలు…. ఆమె సులభంగా లభిస్తుందనే రూమర్లు కూడా ఉన్నాయి. అంతే కాదు.. ఆమె 'డేట్స్' ను కొన్ని సంవత్సరాల పాటు ఆయనే పర్యవేక్షించాడని.. ఆయన ఇష్టానుసారమే ఆమె నడుచుకొందని.. దాంటో వారిద్దరూ ఆర్థికంగా లాభపడ్డారనే వార్తలూ వచ్చాయి!
అయితే కొంతకాలంగా ఆ ఇద్దరి బంధానికి కొంత బ్రేక్ వచ్చింది. అయినా కూడా వారిద్దమద్య అంతర్గతంగా బంధం మాత్రం గట్టిగానే ఉన్నట్టుంది. ఆమెపై ఆ రచయిత సరదాగా.. చతుర్లాడటం కూడా కనిపిస్తోంది. అది కూడా బహిరంగంగా! ఆ మధ్య ఆ భామ ఒక ఖరీదైన కారులోంచి దిగితే.. ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారేంటి.. అంటూ వ్యంగ్యంగా.. నువ్వే సొంతంగా కొనుక్కొన్నావా.. అంటూ ఆశ్చర్యకరంగా ఒక వ్యాఖ్యానించి ఆమె గాలి తీశాడు ఆయన. తాజాగా ఆమె అందాల గురించి ఆయన మరో కామెంట్ వదిలాడు!
ఆ భారీ అందాల భామ సన్నబడే సరికి.. మొదటగా ఆయనే ఆ విషయాన్ని గ్రహించినట్టుగా.. ఏం తిని… ఇంత సన్నబడ్డావ్ అనే కామెంట్ ను వ్యంగ్యంగా.. కన్నుకొడుతున్నట్టుగా.. కాస్తంత శృంగార భరితంగా వదిలాడు ఆయన! దీంతో ఇబ్బంది పడటం ఆమె వంతు అవుతోంది! ఎంత సఖ్యత ఉంటే మాత్రం ఇలాంటి బహిరంగ సరససంభాషణలు మాత్రం వినేవాళ్లకు విడ్డూరంగా.. ఆ హీరోయిన్ కు ఇబ్బందికరంగా ఉన్నాయి!