మొట్టమొదటిసారిగా తనపై తీవ్రస్థాయిలో ఎటాక్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ ట్విటర్ వేదికగా పంచ్ విసిరారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రులుగా పని చేసిన ప్రతి నాయకుడిని ఎంతో గౌరవంగా లోకేశ్ చూశారు. కానీ ఒక్క వైఎస్ జగన్‌ను మాత్రం ఆయన chief ministerగా కాకుండా cheap ministerగా చూడడం గమనార్హం.
మద్యం తాగుతూ, పది మంది అమ్మాయిలతో నీళ్లలో సరసాలాడే నాయకుడు కూడా వాలంటీర్లపై విమర్శలు గుప్పిస్తున్నాడని, యూట్యూబ్‌లో చూస్తే ఆ వీడియోలు కనిపిస్తాయని లోకేశ్‌పై జగన్ సెటైర్ విసిరిన సంగతి తెలిసిందే. లోకేశ్‌తో పాటు చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ సంస్కారం గురించి జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ సంగతేంటో చూద్దాం.
“ఎందరో మహానుభావులు… ఒక్కరే 'చీప్' మినిస్టర్ అని లోకేశ్ తనదైన స్టైల్‌లో జగన్‌పై పంచ్ విసిరారు. ఈ సందర్భంగా గతంలో సీఎంలుగా సేవలందించిన ముఖ్యమంత్రులందరి ఫొటోలను ఒక ఫ్రేమ్‌లో పెట్టడం విశేషం. అలాగే chief minister(s) VS cheap minister అంటూ జగన్ పెద్ద ఫొటోను ప్రముఖంగా ట్విటర్‌లో షేర్ చేశారు. #JaganFailedCM అంటూ లోకేశ్ తన ఆగ్రహాన్ని ట్విటర్ ద్వారా ప్రదర్శించారు. లోకేశ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్‌ను చిల్లర ముఖ్యమంత్రిగా లోకేశ్ అభివర్ణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తనను అమ్మాయిలతో తిరిగే వాడిగా చిత్రీకరించిన జగన్‌ను cheap ministerగా అభివర్ణించి అక్కసు తీర్చుకున్నారని అంటున్నారు.