చరణ్‌ సినిమాకి అంత సీన్‌ లేదు!

మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే మంచి కథలు దొరకడం లేదని వెంకటేష్‌ అన్నాడు. గోపాల గోపాల చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్నప్పటికీ ఇది పూర్తి స్థాయి మల్టీస్టారర్‌ అని అనలేం. సీతమ్మ…

మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే మంచి కథలు దొరకడం లేదని వెంకటేష్‌ అన్నాడు. గోపాల గోపాల చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్నప్పటికీ ఇది పూర్తి స్థాయి మల్టీస్టారర్‌ అని అనలేం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా తర్వాత మళ్లీ వెంకీ ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌ మల్టీస్టారర్‌ ఏదీ ఓకే చేయలేదు. 

తన వద్దకి చాలా కథలు వస్తున్నాయని, కానీ ఏవీ తనకి ఇంట్రెస్ట్‌ కలిగించడం లేదని వెంకటేష్‌ చెప్పాడు. వెంకటేష్‌కి కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ కథ చెప్పిన విషయం తెలిసిందే. వెంకటేష్‌ అందులో నటించడం దాదాపు ఓకే అయిపోయిందనుకున్న తర్వాత దానినుంచి తప్పుకున్నాడు. 

మరి వెంకటేష్‌ చెబుతున్న దాని ప్రకారం ఆ సినిమా కథ ఇంట్రెస్టింగ్‌గా లేదా? కథ నచ్చకే వెంకటేష్‌ ఆ సినిమా వదులుకున్నాడా? మరి గోవిందుడు అందరివాడేలే చరిత్ర సృష్టిస్తుందని అంటోన్న కృష్ణవంశీ చెబుతున్నవి ఉత్త మాటలేనా? ఏదేమైనా వెంకటేష్‌ నటించకపోవడం వల్ల ‘గోవిందుడు అందరివాడేలే’కి క్రేజ్‌ రావడం లేదు. డైరెక్టర్‌ ఫామ్‌లో లేకపోవడంతో చరణ్‌, వెంకీ కాంబినేషన్‌ అయినా దీనికి ఆకర్షణ తెచ్చి ఉండేది