సర్‌ప్రైజ్‌ హిట్‌ అవుతుందా?

భారీ చిత్రాలు విజయవంతం అయిన దాని కంటే చిన్న సినిమాలు సక్సెస్‌ అయితేనే సినిమా బిజినెస్‌ బాగుంటుంది. భారీ సినిమాలకి ప్రాఫిట్‌ మార్జిన్‌ తక్కువ ఉంటుంది. అదే చిన్న సినిమాలు సక్సెస్‌ అయితే లాభాలే…

భారీ చిత్రాలు విజయవంతం అయిన దాని కంటే చిన్న సినిమాలు సక్సెస్‌ అయితేనే సినిమా బిజినెస్‌ బాగుంటుంది. భారీ సినిమాలకి ప్రాఫిట్‌ మార్జిన్‌ తక్కువ ఉంటుంది. అదే చిన్న సినిమాలు సక్సెస్‌ అయితే లాభాలే ఎక్కువ వస్తాయి. అదీ కాక భారీ చిత్రాలు ఏడాదికి మహా అయితే పది వస్తాయి. మిగతా వంద సినిమాలు చిన్నవే వస్తుంటాయి. 

అందుకే చిన్న సినిమాలు ఎంత సక్సెస్‌ అయితే బాక్సాఫీస్‌ వద్ద అంత సందడి ఉంటుంది. గత ఏడాది చిన్న సినిమాల పరంగా విప్లవాత్మక మార్పులొచ్చాయి. కథల పరంగా కొత్తదనాన్ని చూపించిన దర్శకులు విజయాలు సాధించారు. స్వామిరారా, ప్రేమకథా చిత్రమ్‌, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఉయ్యాల జంపాలలాంటి విజయాలు చిన్న సినిమాల రూపకల్పనకి ఊతమిచ్చాయి. 

ఈ ఏడాదిలో చిన్న సినిమాల సందడి ఇంతవరకు లేదు. అలాంటి సర్‌ప్రైజ్‌ హిట్స్‌ అస్సలు లేవింతవరకు. త్వరలో వస్తోన్న కార్తికేయ ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నారు. స్వామిరారాతో నిఖిల్‌ సూపర్‌హిట్‌ కొట్టాడు. మళ్లీ అతను నటించిన కార్తికేయకి పొటెన్షియల్‌ ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే బిజినెస్‌ కూడా అన్ని ఏరియాల్లో బాగా జరిగింది. ఈ నెలలోనే విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితం సాధిస్తుందనేడి చూడాలి.