తమన్నా జ్యూయలరీ, ఇలియానా బొటిక్, జయసుధ ఎక్స్ క్యూజివ్ డిజైనర్ శారీస్, ఇలా మన హీరోయిన్లు అందరూ ఏదో ఒక వ్యాపారాన్ని చేస్తూనే వుంటారు. అలాంటిది అగర్వాల్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే వ్యాపారం బ్లడ్ లోనే వుంటుంది.
అందుకే కాజల్ త్వరలో బిజినెస్ లో వేలు పెట్టబోతోంది. సోలో సినిమాలో హీరోయిన్ గా నటించి కాజల్ చెల్లి నిషా లవ్ మ్యారేజీ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె అత్తింటివారు నిషా బ్రాండింగ్ తో బిజినెస్ ఐడియాలు చేస్తున్నారట.
అయితే అందులో తను కూడా పార్టనర్ గా వుంటానంటోంది కాజల్. ఏముంది..ఇన్ కమ్ లో కాస్త అటు పడేసి, కొన్నాళ్లు చూడకుండా వుంటే అదే గుడ్లు పెడుతుంది. అందువల్ల కాజల్ అక్కడ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం.