సుమంత్ అశ్విన్ తో తేజ

దర్శకుడు తేజ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. అష్టాచెమ్మా, అంతకుముందు ఆ తరువాత లాంటి మాంచి సినిమాలు నిర్మించిన రంజిత్ మూవీస్ సంస్థ ఆ సినిమాను నిర్మిస్తుంది. సుమంత్ అశ్విన్ హీరో.హీరోయిన్ ఎంపిక ఇంకా…

దర్శకుడు తేజ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. అష్టాచెమ్మా, అంతకుముందు ఆ తరువాత లాంటి మాంచి సినిమాలు నిర్మించిన రంజిత్ మూవీస్ సంస్థ ఆ సినిమాను నిర్మిస్తుంది. సుమంత్ అశ్విన్ హీరో.హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. ప్రస్తుతం కథా విస్తరణ చర్చలు సాగుతున్నాయి. 

ఇదిలా వుంటే సుమంత్ అశ్విన్ తో దిల్ రాజు నిర్మించే సినిమాకు రెండో కథానాయికగా వర్మ ఐస్ క్రీమ్ లో నటించిన తేజస్విని ఎంపికయింది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా సుమంత్ అశ్విన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తం మీద వచ్చే ఏడాది సుమంత్ అశ్విన్ టైమ్ బాగానే వుండేటట్లుంది.