నితిన్ ఫంక్షన్ కు నాగార్జున!

నితిన్-నాగ్ కుటుంబాల మధ్య బలం రాను రాను మరింత బలపడుతోంది. నాగ్ చిన్న కొడుకు అఖిల్ తొలిసినిమా తానే నిర్మించాలనుకున్న నాగ్, ఆఖరికి దాన్ని నితిన్ హోమ్ ప్రొడక్షన్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.…

నితిన్-నాగ్ కుటుంబాల మధ్య బలం రాను రాను మరింత బలపడుతోంది. నాగ్ చిన్న కొడుకు అఖిల్ తొలిసినిమా తానే నిర్మించాలనుకున్న నాగ్, ఆఖరికి దాన్ని నితిన్ హోమ్ ప్రొడక్షన్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంఘటన కూడా ఈ రెండు ఫ్యామిలీల స్నేహాన్ని చాటి చెప్పబోతోంది. నితిన్ తాజా సినిమా ‘చినదాన నీకోసం’. కరుణాకరన్ దర్శకుడు. 

ఈ సినిమా అడియో ఫంక్షన్ త్వరలో జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు నాగార్జున ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, నితిన్ తనకు పవర్ స్టార్ పవన్ పై వున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆ వేదికపై ఆయనపై ఓ కార్యక్రమమో, పాటకు డ్యాన్స్ నో చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.