ఇలాఅంటే..సాక్షి బ్యాంకులకో, ఫైనాన్షియర్లకో బాకీలు పడిపోయిందని అనుమాన పడద్దు. ఆ తరహా సీన్ లేదు. సాక్షికే రావాల్సిన బాకీలు బాగా పేరుకుపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షా రెండు లక్షలు, కోటి, అరకోటి అయితే చెప్పుకోవడానిక ఏముంది? కానీ అలా కాదట. చాలా..అంటే చాలా పెద్ద మొత్తంలో, అంటే కోట్లలో, మార్కెటింగ్, అడ్వర్ టైజింగ్ బకాయిలు పేరుకున్నాయని వినికిడి.
అయితే వీటి గురించి కానీ, వీటి వైనం గురించి కానీ పెద్దగా ఎవరు పెదవి విప్పడానికి సాహసించడం లేదట. కారణం, భారతీ రెడ్డికి సన్నిహితమైన అధికారి కీలకపదవిలో వుండడమే కారణం అని కూడా వినిపిస్తోంది. కంపెనీ అధినేతలకే పట్టనపుడు, మనకెందుకు అని మిగిలిన వారు గమ్మున వున్నారట. భారతీ రెడ్డి మంచితనం ఆసరగా తీసుకుని కొందరు పై స్థాయి అధికారులు సంస్థకు చేటు చేస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు గుసగుసలుపోతున్నారట.