Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని జీవితం

సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని జీవితం

రివ్యూ: పిల్లా.. నువ్వులేని జీవితం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌, ఎస్‌.వి.సి. సినిమాస్‌
తారాగణం: సాయి ధరమ్‌ తేజ్‌, జగపతిబాబు, రెజీనా, ప్రకాష్‌రాజ్‌, సయాజీ షిండే, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, జయప్రకాష్‌రెడ్డి, సత్య కృష్ణ తదితరులు
మాటలు: డైమండ్‌ రత్నం
నేపథ్య సంగీతం: చిన్నా
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: బన్నీ వాస్‌, హర్షిత్‌
కథ, కథనం, దర్శకత్వం: ఏ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి
విడుదల తేదీ: నవంబర్‌ 14, 2014

చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో తెర మీదకి వచ్చాడు. చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన మొదటి చిత్రం ‘రేయ్‌’ అయినా కానీ ముందుగా మన ముందుకి వచ్చింది ‘పిల్లా నువ్వులేని జీవితం’. సాయి ధరమ్‌ తేజ్‌పై కలిగే ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఏంటి.. సినిమా ఎలాగుంది అనే డీటెయిల్స్‌లోకి వెళితే..

కథేంటి?

మైసమ్మ (జగపతిబాబు) అనే రౌడీ దగ్గరకి తనని చంపేయమని డీల్‌ కుదుర్చుకోవడానికి వస్తాడు శీను (సాయి ధరమ్‌ తేజ్‌). తనని ఎందుకు చంపాలో చెప్పమంటే శీను తన ప్రేమకథ చెప్తాడు. సిరితో (రెజీనా) తన పరిచయం ఎలా జరిగిందో, ఆమె కోసం ఏమేం చేసాడో వివరిస్తాడు. మరి ఎందుకని చనిపోవాలనుకుంటున్నాడు. తన ప్రేమకథలో వచ్చిన సమస్యలేంటి?  

కళాకారుల పనితీరు:

సాయి ధరమ్‌ తేజ్‌ కాన్ఫిడెంట్‌గా నటించాడు. కెమెరా ఫేస్‌ చేయడంలో ఎలాంటి బెరుకు, బిడియం లేదు. యాక్షన్‌ సీన్స్‌ బాగా చేసాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో మంచి డాన్సర్‌ ఇతను. స్టయిలింగ్‌ పరంగా కేర్‌ తీసుకుని ఉండాల్సింది. ఆ హెయిర్‌ స్టయిల్‌ అతనికి అంతగా సూట్‌ కాలేదు. అయినప్పటికీ తన కాన్ఫిడెంట్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఫస్ట్‌ ఎటెంప్ట్‌లోనే ఇంప్రెస్‌ చేస్తాడు. కెరీర్‌ పరంగా రైట్‌ డెసిషన్స్‌ తీసుకుని... కరెక్ట్‌ మూవీస్‌ ఎంచుకుంటే డెఫినెట్‌గా మరో బ్యాంకబుల్‌ హీరో అవుతాడు.

జగపతిబాబు గెటప్‌ బాగుంది. అతని పర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ అయినా కానీ ఎంటర్‌టైనింగ్‌గా ప్రెజెంట్‌ చేసారు. రెజీనా అందంగా ఉంది.. ఎప్పటిలా తన పర్‌ఫార్మెన్స్‌తో స్కోర్‌ చేసింది. రఘుబాబుకి చాలా కాలం తర్వాత మళ్లీ ఒక ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌ దక్కింది. తన మార్కు కామెడీతో రఘుబాబు బాగానే నవ్విస్తాడు. జయప్రకాష్‌ రెడ్డిపై తీసిన ట్రాక్‌ కూడా ఆకట్టుకుంటుంది. ప్రకాష్‌రాజ్‌, ప్రభాస్‌ శ్రీను, సత్య కృష్ణ సపోర్టింగ్‌ రోల్స్‌లో ఎంటర్‌టైన్‌ చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

అనూప్‌ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. చిన్నా అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ బాగుంది. ఎక్కడా వృధా సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. రెండు గంటల పది నిముషాల నిడివితో కథనం పరుగులు పెడుతుంది. డైమండ్‌ రత్నం రాసిన సంభాషణలు బాలేదు. సన్నివేశాల్లో వినోదం బాగా ఉన్నా కానీ అందుకు తగ్గ సంభాషణలు రాయడంలో మాటల రచయిత విఫలమయ్యాడు. సినిమా అవసరానికి మేరకు నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 

Video: Pilla Nuvvu Leni Jeevitham Public Talk

రవికుమార్‌ చౌదరి ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ కాకుండా చూసుకున్నాడు. అయితే హీరో హీరోయిన్ల ప్రేమకథని బాగా హ్యాండిల్‌ చేసి ఉండాల్సింది. స్క్రీన్‌ప్లే పరుగులు పెట్టినా కానీ గుర్తుండిపోయే సన్నివేశాలేమీ లేకపోవడం వల్ల ‘పిల్లా నువ్వు లేని జీవితం’ టైమ్‌ పాస్‌ సినిమాగా మిగిలిపోయింది. ఇదే కంటెంట్‌ని ఇంకా బెటర్‌గా ప్రెజెంట్‌ చేసే అవకాశాలున్నా కానీ దర్శకుడు యావరేజ్‌ ప్రెజెంటేషన్‌తో సరిపెట్టేసాడు. 

హైలైట్స్‌:

  • సాయి ధరమ్‌ తేజ్‌ కాన్ఫిడెంట్‌ డెబ్యూ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • ఇంటర్వెల్‌ సీన్‌

డ్రాబ్యాక్స్‌:

  • హీరో హీరోయిన్స్‌ లవ్‌ ట్రాక్‌
  • శ్రుతి మించిన క్లయిమాక్స్‌ సీన్స్‌

విశ్లేషణ:

కథలో పెద్దగా మేటర్‌ లేకపోయినా కానీ స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఒక మామూలు కథనే కొత్త స్టయిల్‌లో నెరేట్‌ చేయడం మెప్పిస్తుంది. కాకపోతే కీలకమైన హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలని చాలా మామూలుగా తీసేసారు. ఆ సన్నివేశాలు బాగుండి ఉంటే ప్రథమార్థం మరింత ఇంప్రెస్‌ చేసేది. ఇంటర్వెల్‌ సీన్‌లో వచ్చే ట్విస్ట్‌ బాగా పేలింది. ఆ సీన్‌ తర్వాత సెకండ్‌ హాఫ్‌ యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందేమో అనే ఫీలింగ్‌ వస్తుంది కానీ తర్వాత కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదే ఫోకస్‌ పెట్టి తెలివిగా మేనేజ్‌ చేసారు. ఈమధ్య కామెడీ అంటే ఒకే రకమైన ఫార్ములాని నమ్ముకుంటున్నారు. బ్రహ్మానందంని బకరా చేస్తూ... హీరోతో మైండ్‌ గేమ్స్‌ ఆడించడం మామూలైపోయింది. ఈ సినిమాలో అలాంటి రొటీన్‌ కామెడీ లేకపోవడం పెద్ద రిలీఫ్‌. 

అయితే క్లయిమాక్స్‌ని కూడా కామెడీగానే తీసే ఉద్దేశంతో మీడియా నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌పై తీసిన సీన్స్‌ మరీ శ్రుతి మించాయి. లాజిక్‌కి అతీతంగా సాగే ఆ సన్నివేశాలని అందరూ ఎంజాయ్‌ చేయలేరు. కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ కాలక్షేపానికి లోటు లేని సినిమా ఇది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు లేకుండా చూసుకుని సేఫ్‌ గేమ్‌ ఆడడం వల్ల ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అన్ని వర్గాల ప్రేక్షకులతోను ఫర్వాలేదనిపించుకుంటుందే తప్ప.. బాగోలేదు, విసిగించింది.. లాంటి కామెంట్స్‌ తెచ్చుకోదు. కాకపోతే ఈ ఐడియాని మరింత కొత్తగా ప్రెజెంట్‌ చేసే స్కోప్‌ ఉన్నా కానీ డైరెక్టర్‌ దానిని ఒక స్థాయికే లిమిట్‌ చేసేసాడనిపిస్తుంది. 

హీరోగా సాయి ధరమ్‌ తేజ్‌కి డీసెంట్‌ లాంఛ్‌ ప్యాడ్‌ అనిపించే ఈ చిత్రం అతడిపై నమ్మకాన్ని కలిగిస్తుంది. మొదటి సినిమా కూడా రిలీజ్‌ కాకముందే అతని మూడో సినిమా అప్పుడే లాంఛ్‌ అయిపోవడం.. పేరున్న నిర్మాతలు, దర్శకులు అతడిపై కాన్ఫిడెన్స్‌ చూపించడానికి కారణాలు ఏమిటో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. 

బోటమ్‌ లైన్‌: పిల్లోడు బాగా చేసాడు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Watch Pilla Nuvvu Leni Jeevitham Special videos

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా