కమల్ నుంచి మళ్లీ కామెడీ

కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఆయనలోని కామెడీ యాంగిల్, కామెడీ స్క్రిప్ట్ లు మాత్రం ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. ముఖ్యంగా సతీలీలావతి, పంచతంత్రం వంటి సినిమాలు ఎవర్…

కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఆయనలోని కామెడీ యాంగిల్, కామెడీ స్క్రిప్ట్ లు మాత్రం ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. ముఖ్యంగా సతీలీలావతి, పంచతంత్రం వంటి సినిమాలు ఎవర్ గ్రీన్. ఇటీవల కమల్ తమ కామెడీకి దూరమయ్యాడు. విశ్వరూపం, పాపనాశం, చీకటిరాజ్యం, ఉత్తమ విలన్ లాంటి సీరియస్ సినిమాలకు అంకింతమయ్యాడు. 

అయితే మళ్లీ ఇప్పుడు ఓ కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మౌళి అందించిన స్క్రిప్ట్ నచ్చి కమల్ ఓకే చేసాడని, చీకటి రాజ్యం సినిమా డైరక్ట్ చేసిన కమల్ అసిస్టెంట్ రాజేష్ నే ఈ సినిమా కూడా డైరక్ట్ చేస్తారని తెలుస్తోంది. మౌళి అంటే 1980 ల నుంచి రెండువేల నడుమ సూపర్ వెర్సటైల్ డైరక్టర్. 

సుమారు ముఫై సినిమాలకు పైగా డైరక్ట్ చేసాడు. చాలా సినిమాల్లో నటించాడు. ఆయన సినిమాల స్క్రిప్ట్ లు అన్నీ చాలా పకడ్బందీగా వుంటాయి. అందువల్ల కమల్ నుంచి మంచి కామెడీ సినిమాను కచ్చితంగా ఆశించవచ్చు.