సురేష్ కూడా లాసయ్యాడా?

దగ్గుబాటి సురేష్ అంటేనే ఓ పెర్ ఫెక్ట్ కాలుక్యులేషన్. సినిమా రిజల్ట్ ఎలా వున్నా, చేతికి పైసా లాస్ లేకుండా ప్లాన్ చేసుకునే పక్కా బిజినెస్ మైండ్. అలాంటిది ఇప్పుడు దెబ్బతిన్నాడు. అది కూడా…

దగ్గుబాటి సురేష్ అంటేనే ఓ పెర్ ఫెక్ట్ కాలుక్యులేషన్. సినిమా రిజల్ట్ ఎలా వున్నా, చేతికి పైసా లాస్ లేకుండా ప్లాన్ చేసుకునే పక్కా బిజినెస్ మైండ్. అలాంటిది ఇప్పుడు దెబ్బతిన్నాడు. అది కూడా దగ్గర దగ్గర అరకోటి కి కాళ్లొచ్చేసాయి. చిన్న సినిమా, బాగానే వుండేలా వుంది. ఏమాత్రం బాగున్నా అరకోటి రాకపోతాయా..శాటిలైట్ వుండనే వుందిగా..ఇలా లెక్కలు వేసుకుని, రంజిత్ మూవీస్ 'హోరాహోరీ'లో పార్టనర్ గా జాయిన్ అయిపోయారు. 

తీరా చేస్తే, దర్శకుడి తేజ తన పంథ తనదే అనే వైఖరి వల్ల కావచ్చు, లేదా జనాలను అంచనా వేయడంలో తేజ చేసిన తప్పిదం వల్ల కావచ్చు,,సినిమా బొక్కబోర్లా పడిపోయింది. 'హోరాహోరీ' ఇది సినిమానా..'హారి'బుల్ అంటూ థియేటర్లకు దూరమైపోయారు. పైగా తేజ మితిమీరిన నమ్మకంతో, నా సినిమా బాగుంటేనే రండి..లేకుంటే పైరసీలో చూడండి, లాంటి చిత్రమైన స్టేట్ మెంట్ లు వదిలారు. 

పైరసీలో చూడమని ఆయనే చెబుతుంటే, బాగున్నా అందులోనే చూస్తామనుకున్నారేమో కూడా. ఏమయితేనేం. మొత్తానికి తేజకు పోయింది కష్టం మాత్రమే..ఇటు దాము అండ్ కోకు, అటు సురేష్ కు చెరో యాభై మటాష్. శాటిలైట్ ఆశ ఒక్కటే మిణుకు మిణుకు మంటోంది.