హోమ్‌ వర్క్‌ చేస్తున్న పవన్‌కళ్యాణ్‌

డైరెక్ట్‌గా సెట్‌కి వచ్చి డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేసేయడమే తప్ప తన సినిమాలకి పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకించి హోమ్‌ వర్క్‌ ఏమీ చేయడు. జానీ మినహాయిస్తే అతను తన ఆహార్యం విషయంలో కూడా ప్రత్యేక…

డైరెక్ట్‌గా సెట్‌కి వచ్చి డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేసేయడమే తప్ప తన సినిమాలకి పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకించి హోమ్‌ వర్క్‌ ఏమీ చేయడు. జానీ మినహాయిస్తే అతను తన ఆహార్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చిత్రాలేవీ లేవు. అయితే తన కెరీర్‌లో తొలిసారిగా ఒక పాత్ర కోసం పవన్‌ హోమ్‌ వర్క్‌ చేస్తున్నాడు.     

పవన్‌ ప్రత్యేక పాత్ర చేస్తోన్న ‘గోపాల గోపాల’ సినిమాకోసమే ఈ హోమ్‌ వర్క్‌ జరుగుతోందట. ఇందులో పవన్‌ మోడరన్‌ శ్రీకృష్ణుడి పాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. దేవుడి పాత్ర కనుక తన సహజసిద్ధమైన నటన సూట్‌ అవదు కనుక బాడీ లాంగ్వేజ్‌పై, డైలాగ్‌ డెలివరీపై పవన్‌ కేర్‌ తీసుకుంటున్నాడట. 

ఈ సినిమాలో తన పాత్ర ఉండేది కాసేపే కనుక, దానిపై చాలా అంచనాలున్నాయి కనుక పవన్‌కళ్యాణ్‌ అవన్నీ దృష్టిలో ఉంచుకుని దీనిని సీరియస్‌గా తీసుకున్నాడు. ఈపాటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సిన పవన్‌ ఇంతదాకా షూటింగ్‌ మొదలు పెట్టకపోవడానికి కూడా కారణం ఇదేనట. గెటప్‌ విషయంలోను పవన్‌కి ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం.