రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా ప్రత్యేక పాత్ర చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించిన సంగతి తెలిసిందే. మహేష్‌బాబు, ఎన్టీఆర్ కాదన్న తర్వాత గుణశేఖర్ ఈ పాత్రని అల్లు అర్జున్‌కి ఆఫర్ చేసాడు. ఈ క్యారెక్టర్ తనకి బాగా నచ్చేయడంతో దీనిని ఉచితంగా చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.
రేసుగుర్రంతో తన రేంజ్ పెంచుకున్న అల్లు అర్జున్ డేట్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు. భారీ పారితోషికం ఇచ్చుకుంటే తప్ప బన్నీ డేట్స్ దక్కవు. రుద్రమదేవికి గుణశేఖర్ కూడా అతనికి టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చి ఉంటాడని అనుకున్నారు కానీ అలాంటిదేమీ లేదని తెలిసింది. క్యారెక్టర్ బాగా నచ్చేయడంతో అల్లు అర్జున్ ఇది ఫ్రీగా చేస్తున్నాడట.
అయితే ఈ చిత్రంలో అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా చేరాడని, అందుకే అల్లు అర్జున్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించాడని మరో టాక్ కూడా ఉంది. అదే నిజమైతే కనుక నిర్మాణంలో అల్లు అర్జున్‌కి కూడా భాగం ఉన్నట్టే. ఇక నిర్మాతకి ప్రత్యేకించి పారితోషికం ఎందుకుంటుంది!