బాహుబ‌లి.. 4 గంట‌ల 40 నిమిషాలు

రోజుకో పోస్టర్ విడుద‌ల చేస్తూ.. 'బాహుబ‌లి' ప‌బ్లిసిటీనీ వినూత్నంగా నిర్వహిస్తున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాకి వ‌ద్దన్నా.. కావ‌ల్సినంత ప్రచారం తీసుకొస్తోంది మీడియా. బాహుబ‌లికి సంబంధించిన ఏ చిన్న విష‌య‌మైనా… ఇప్పుడు చిత్రసీమ‌లో హాట్‌టాపిక్కే. ఇప్పుడు…

రోజుకో పోస్టర్ విడుద‌ల చేస్తూ.. 'బాహుబ‌లి' ప‌బ్లిసిటీనీ వినూత్నంగా నిర్వహిస్తున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాకి వ‌ద్దన్నా.. కావ‌ల్సినంత ప్రచారం తీసుకొస్తోంది మీడియా. బాహుబ‌లికి సంబంధించిన ఏ చిన్న విష‌య‌మైనా… ఇప్పుడు చిత్రసీమ‌లో హాట్‌టాపిక్కే. ఇప్పుడు ఈ సినిమా గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. 

అదేంటంటే బాహుబ‌లి నివిడి 4గంట‌ల 40 నిమిషాల‌ట‌. దీన్ని రెండు భాగాలుగా విడ‌గొట్టాడు రాజ‌మౌళి. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ లెంగ్తీగా ఉండ‌బోతున్నట్టు తెలుస్తోంది. అంటే తొలిభాగం రెండుగంట‌ల‌తో ముగించే అవ‌కాశాలున్నాయ‌ట‌. పార్ట్ 2లో కొన్ని కీల‌క‌మైన సన్నివేశాల్ని ఇంకా తెర‌కెక్కించాలి. 

ఆ స‌న్నివేశాల నిడివి ఏమాత్రం పెరిగినా.. పార్ట్ 2 మ‌రింత లెంగ్తీగా మారే అవ‌కాశాలున్నాయి. ఈనెల 31న బాహుబ‌లి పాట‌లు విడుద‌ల కానున్నాయి. అందుకు త‌గిన వేదిక కూడా రాజ‌మౌళి అండ్ టీమ్ వెదికి ప‌ట్టుకొన్నట్టు తెలుస్తోంది. ఆవివ‌రాలు మ‌రికొద్ది రోజుల్లో వెల్లడ‌య్యే అవ‌కాశాలున్నాయి.