వయస్సు కావచ్చు..కాలం కావచ్చు జనాల్లో మార్పు తేవడం సహజం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లో కూడా ఈ తరహా మార్పుకనిపిస్తోంది. ఇప్పుడు ఆయన జనాలకు చాలా దగ్గరగా వుంటున్నారు. ఇది వరకు లేరు అని కాదు, ఆయన తన చుట్టూ వున్న జనాలకు మాత్రం దగ్గరగావుండేవారు.
ఇప్పుడు తరచు ఆయన తన ఫంక్షన్లను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వాటికి వచ్చే జనం ఎవరైనా, ఎంతమందైనా ఓపిగ్గా కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఫోటో అంటే ఫోటో, సెల్ఫీ అంటే సెల్ఫీ. అలాగే మీడియా ఏదైనా సరే ఓపిగ్గా మాట్లాడుతున్నారు.
ఆఖరికి ఇప్పుడు మాటీవీలో వంటింటి ప్రోగ్రామ్ కు కూడా వచ్చేసారు. ఈ మార్పు సినిమాల్లో కూడా కనిపించి, సీరియస్ గా సినిమాలు తీస్తారేమో చూడాలి. 365 సినిమా దానికి నాంది అని అంటున్నారు. ఎంతవరకు నిజమో నాలుగు రోజులు ఆగితే తెలిసిపోతుంది.