టైగర్ సందీప్ కు వెరైటీ

ఠాగూర్ మధు నిర్మిస్తున్న టైగర్ సినిమా మీద సందీప్ కిషన్ చాలా హోప్ పెట్టుకున్నాడు. ప్రస్థానం తరువాత నటుడిగా అంత పేరు తెస్తుందని అంటున్నాడట. ఈ సినిమాలో ఇంటర్వెల్ కు పది నిమషాల ముందు…

ఠాగూర్ మధు నిర్మిస్తున్న టైగర్ సినిమా మీద సందీప్ కిషన్ చాలా హోప్ పెట్టుకున్నాడు. ప్రస్థానం తరువాత నటుడిగా అంత పేరు తెస్తుందని అంటున్నాడట. ఈ సినిమాలో ఇంటర్వెల్ కు పది నిమషాల ముందు మాత్రమే సందీప్ పాత్ర ప్రవేశిస్తుందని వినికిడి. అంతవరకు రాహుల్ మాత్రమే వుంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు మాత్రమే సందీప్ కిషన్ రన్ ప్రారంభమవుతుంది. 

ఇదిలా వుంటే ఇటీవల కాలంలో విడుదలకు చాలా ముందే ఫుల్ బిజినెస్ క్లోజ్ అయిన మీడియం రేంజ్ సినిమాగా టైగర్ ఓ క్రెడిట్ కొట్టేసినట్లే. శాటిలైట్ కాలేదు కానీ, రెండు రాష్ట్రాల్లో ఎన్ ఆర్ కే సేల్స్ పూర్తికావడం విశేషం. సీరత్ కపూర్ ఈ సినిమాలో కథానాయిక.