అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి హీరోలుగా సెటిలైనవారున్నారు. అయితే వాళ్లెవరూ మళ్లీ డైరెక్షన్ జోలికి పోతామని అన్లేదు. భలే భలే మగాడోయ్తో మంచి జోరుమీదున్న నాని కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినవాడేనని తెలిసిందే. అయితే మిగతావారికి భిన్నంగా నాని మాత్రం డైరెక్షన్ చేస్తానని ప్రకటించాడు.
హీరోగా మారి హిట్లు సాధిస్తున్న నాని… ప్రస్తుతం తాను చాలా హ్యీపీగా ఉన్నానని, కంఫర్టబుల్ జోన్లో ఉన్నానని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎవరైనా అసిస్టెంట్ డైరక్టర్ గా చేయడం అంటే భవిష్యత్తులో దర్శకుడు కావాలనే ఆశతోనే కదా. మరి హీరోగా సెటిలైన నాని ఒకనాటి తన ఆకాంక్షను నెరవేర్చుకునే అవకాశం లేనట్టేనా?
ఈ ప్రశ్ననే నాని ముందుంచితే… ఆ అవకాశం ఉండడమే కాదు ఎప్పటికైనా డైరెక్షన్ చేసి తీరతానన్నాడు. దర్శకత్వం చేయాలనే ఆలోచనను మానుకోలేదని స్పష్టం చేశాడు. భలే భలే మగాడివోయ్ సినిమా తయారీలో కేవలం ఒక హీరోగా, తన పనికి మాత్రమే పరిమితమైపోకుండా దర్శకుడు మారుతికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాడట నాని. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మారుతి ఈ విషయం చెప్పాడు. సో… మనవాడు అటు హీరోగా చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా తన డైరెక్షన్ స్కిల్స్‌కు మెరుగులు దిద్దుకుంటున్నాడన్నమాట.
మరోవైపు బన్నీ. జూనియర్ ఎన్టీయార్, రామ్‌చరణ్ వంటి నవతరం హీరోలంతా నాని నటనకు హ్యాట్సాఫ్ అంటూ బహిరంగంగానే పొగిడేస్తున్నారు. ఈ పొగడ్తలపై ఇది ఆ హీరోల గొప్పతనానికి నిదర్శనం అని మాత్రమే కాకుండా, టాలీవుడ్‌కి ఫ్యూచర్ లాంటి వీళ్లంతా ఇంత మంచి మనసున్నవారు కావడం పరిశ్రమకు మంచిదంటూ నాని స్పందించాడు. ఈ పరస్పర ప్రశంసలు చూస్తుంటే… భవిష్యత్తులో నాని దర్శకత్వం అంటూ చేస్తే కాల్షీట్లు ఇచ్చే స్టార్ హీరోలకూ కొరతలేనట్టే కనిపిస్తోంది.