తేజా..ఇది కాస్త ఎక్కువేమో?

తాత హీరో..మనవడు హీరో..ఇలా అయితే కామన్ మాన్ హీరో అయ్యేదెన్నడు…అందుకే హీరో కావాలనుకునే కామన్ మాన్ కు నేనున్నా అనేసాడు దర్శకుడు తేజ. టాలీవుడ్ లో ఇదే పరిస్థితి వుందన్న మాట నిజమే. Advertisement…

తాత హీరో..మనవడు హీరో..ఇలా అయితే కామన్ మాన్ హీరో అయ్యేదెన్నడు…అందుకే హీరో కావాలనుకునే కామన్ మాన్ కు నేనున్నా అనేసాడు దర్శకుడు తేజ. టాలీవుడ్ లో ఇదే పరిస్థితి వుందన్న మాట నిజమే.

అక్కినేని, నందమూరి, దగ్గుబాటి, మెగాక్యాంప్ అంటూ కొన్ని కుటుంబాల జనాలే హీరోలవుతున్నారు ఎక్కువగా. టాలెంట్ వున్నవాళ్లని తాను ప్రోత్సహిస్తానని, ఇప్పటికి వెయ్యి మందిని పరిచయం చేసానని అంటున్నాడు. ఆ సంఖ్య కాస్త ఎక్కువేమో అంటున్నారు.

ఎందుకంటే తేజ తీసినవి ఎన్ని సినిమాలు కనుక. మహా అయితే ఇరవై వుంటాయి. సినిమాలు అన్నింటిలో మొత్తం కొత్తవాళ్లనే పెట్టేసాడు అనుకున్నా, వెయ్యి మంది ఎక్కడవుతారు?  ప్రతి సినిమాకు యాభై మందిని పరిచయం చేసి వుండాలి.

ఈ సంగతి అలా వుంచితే, హోరాహోరీ హీరో సంగతి  పక్కన పెడితే, తేజ పరిచయం చేసిన నవదీప్, నితిన్, చిన్నింటి వాళ్లేం కాదు.వాళ్లది బడా బ్యాక్ గ్రవుండే. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడుకి కూడా తండ్రి నేపథ్యంవుంది.

ఉదయ్ కిరణ్ ను తీసుకున్నిది రామోజీరావు..కానీ తేజ కాదు కదా. పోనీ కామన్ మాన్ ను తీసుకుని, మంచి రెమ్యూనిరేషన్ ఏమన్నా ఇస్తున్నారా? హోరా హోరీ దిలీప్ కు ఇచ్చంది వన్ రుపీనే కదా? ఆ విధంగా తేజకు కూడా లాభమే కదా?