దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు అమెరికాలో కలెక్షన్ల రికార్డ్స్ తిరగరాశాయి. దీంతో ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఓవర్సీస్ బాద్షా అనే పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ మధ్య వచ్చిన అత్తారింటికి దారేది సినిమా సైతం అక్కడ మంచి కలెక్షన్లు సాధించింది.
వీటన్నింటినీ దాటేస్తూ బాహుబలి సంచలనాలను నమోదు చేసింది. దీంతో… ఇంతకీ మహేష్ ఓవర్సీస్ బాద్ షా అని అభివర్ణించడం సరికాదేమోననే సందేహాలు మొదలయ్యాయి. అయితే అలాంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నవారికి శ్రీమంతుడు కలెక్షన్లు సమాధానంగా నిలుస్తున్నాయి.
తాజాగా మహేష్ స్టామినాను తిరగరాసిన శ్రీమంతుడు అమెరికాలో రూ.18కోట్ల కలెక్షన్లు (సెప్టెంబరు 10 వరకూ) కలెక్ట్ చేసింది. తద్వరా అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది. వేరే తెలుగు సినిమాలతో పోల్చడానికి కుదరని బాహుబలి అమెరికాలో రూ.38కోట్లు కలెక్ట్ చేసింది. గతంలో రూ.10కోట్లు కలెక్ట్ చేసింది అత్తారింటికి దారేది.
దీంతో మహేష్ మాత్రమే ఓవర్సీస్ కలెక్షన్లకు చిరునామా అనడం కరెక్టేనా అంటూ మొదలైన సందేహాలను శ్రీమంతుడు పటాపంచలు చేసింది. ప్రిన్స్‌కు ఓవర్సీస్లో సూపర్ రెస్పాన్స్ ఉందని తేల్చింది.