మన దగ్గర టీనేజ్ లవ్ స్టోరీ లు అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది తేజ తీసిన ‘చిత్రం’. అంతకు ముందు భారతీ రాజా అందించిన ‘ సీతాకోకచిలుక’. అవి ఒక విధంగా రెండు జనరేషన్లకు రెండు సినిమాలుగా నిలిచాయి. మరీ ఇప్పుడు ఈ ఐప్యాడ్ జనరేషన్ కు కూడా ఓ టీనేజ్ లవ్ స్టోరీ లేని కొరతను తీర్చేస్తున్నట్లుంది నాగ్..’నిర్మల కాన్వెంట్’.
టైటిల్ కాన్వెంట్ అని పేరుంది..పాటల్లో ముద్దుపై మురిపాలు వినిపిస్తున్నాయి కాబట్టి టీనేజ్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అయిపోవచ్చు. పైగా హీరో రోషన్ (శ్రీకాంత్-ఊహల తనయుడు) కూడా నూనూగు మీసాల పిలగాడే. అందువల్ల ఈ జనరేషన్ కు మరో మాంచి ‘పిల్ల ప్రేమ కథా చిత్రమ్’ అందిచబోతున్నారనే అనుకోవాలి.
Click Here For Okkosari Okko Muddu Song
నాగ్ బ్యానర్ నుంచి వస్తోంది కాబట్టి, మరీ చిల్లర వ్యవహారాలు వుండవని కన్ఫర్మ్ గా అనుకోవచ్చు. పైగా తన భార్య అమలకు అంకింతం చేస్తూ విడుదల చేసిన పాట కూడా కాంటెంపరరీగా, మెలోడియస్ గా బాగానే వుంది. సో..అంతా బాగానే వుంటుదని ఆశించేయచ్చు.