పవన్‌కళ్యాణ్‌కి జోడీ కుదిరింది

పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ సీక్వెల్‌ అనౌన్స్‌ చేసి చాలా కాలమవుతోంది. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ కూడా ఫిబ్రవరిలో జరిగింది. కానీ ఇంతవరకు ఈ చిత్రం షూటింగ్‌ అయితే మొదలు కాలేదు. అన్నీ ఫిక్స్‌ అయినా…

పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ సీక్వెల్‌ అనౌన్స్‌ చేసి చాలా కాలమవుతోంది. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ కూడా ఫిబ్రవరిలో జరిగింది. కానీ ఇంతవరకు ఈ చిత్రం షూటింగ్‌ అయితే మొదలు కాలేదు. అన్నీ ఫిక్స్‌ అయినా కానీ హీరోయిన్‌ విషయంలో మాత్రం చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 

ఫైనల్‌గా కాజల్‌ అగర్వాల్‌ని ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా అనౌన్స్‌ చేసినపుడు ముందుగా కాజల్‌ పేరే వినిపించింది కానీ ఆమె పారితోషికం ఎక్కువ అడిగిందని వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు కాజల్‌ తన పారితోషికం తగ్గించుకుని సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుండడంతో ఆమెకి మరో ఛాన్స్‌ వచ్చింది. 

ఈసారి కాజల్‌ వెంటనే అంగీకరించిందని సమాచారం. చరణ్‌తో గోవిందుడు, ఎన్టీఆర్‌తో పూరి సినిమా చేస్తోన్న కాజల్‌కి ఇప్పుడు గబ్బర్‌సింగ్‌ 2తో మరో పెద్ద సినిమా చేతికొచ్చింది. అంతే కాదు… ఫీల్డులో ఉన్న మెగా హీరోలు అందరితోను నటించిన ఘనత కూడా దక్కించుకుంటుంది. ఆమె చరణ్‌, అల్లు అర్జున్‌తో ఇంతకుముందే నటించిన సంగతి తెలిసిందే. పవన్‌తో తనకి ఇదే ఫస్ట్‌ ఫిలిం.