సందీప్‌ ‘కృష్ణయ్య’ హ్యాపీ

ఒక హీరో సినిమాకి ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయంటే ఆడియన్స్‌ దృష్టిలో అతను ‘హీరో’ అయినట్టే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఘన విజయం సాధించిన సందీప్‌ కిషన్‌కి ఆ గుడ్‌ విల్‌ ఇప్పుడు తన కొత్త సినిమా…

ఒక హీరో సినిమాకి ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయంటే ఆడియన్స్‌ దృష్టిలో అతను ‘హీరో’ అయినట్టే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఘన విజయం సాధించిన సందీప్‌ కిషన్‌కి ఆ గుడ్‌ విల్‌ ఇప్పుడు తన కొత్త సినిమా విషయంలో కలిసొస్తోంది. ‘రారా కృష్ణయ్య’ చిత్రం డీసెంట్‌ ఓపెనింగ్స్‌తో లేటెస్ట్‌ రిలీజెస్‌లో కమర్షియల్‌గా బెస్ట్‌ అనిపించుకుంటోంది. 

సందీప్‌ కిషన్‌కి తోడు జగపతిబాబు కూడా జత కలవడంతో మాస్‌ సెంటర్స్‌లో రారా కృష్ణయ్యకి స్పందన బాగుంది. కమర్షియల్‌ ఫార్మాట్‌లో డీల్‌ చేయడంతో ఈ చిత్రం బి, సి సెంటర్స్‌లో పే చేస్తుందని ట్రేడ్‌ టాక్‌. గత వారం విడుదలైన ఆటోనగర్‌ సూర్య పూర్తిగా డల్‌ అవడంతో ఈ వారంలో మన ప్రేక్షకులకి ఇదొక్కటే ఆప్షన్‌ అయింది. 

దీనిని ఎన్ని రోజుల పాటు కృష్ణయ్య క్యాష్‌ చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతానికి తన కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వస్తున్నాయని సందీప్‌ కిషన్‌ హ్యాపీగా ఉన్నాడు. వీకెండ్‌ తర్వాత కూడా ఈ చిత్రం డీసెంట్‌గా పర్‌ఫార్మ్‌ చేస్తే బయ్యర్లు కూడా హ్యాపీ అవుతారు. అసలే వచ్చే వారంలో దృశ్యం రిలీజ్‌కి రెడీగా ఉంది కాబట్టి ఫోకస్‌ దానిపైకి మళ్లక ముందే ఇది సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోవాలి.