అక్క స్మార్ట్‌గా వుంది కదా.. నేను బొద్దుగానే వుంటాను

అక్కా చెల్లెళ్ళు అందంలోనే కాదు, ఆలోచనల్లోనూ అలవాట్లలోనూ పోటీపడుతుంటారు. హిందీ భామ ప్రియాంకా చోప్రా చక్కని చుక్క. అందంతోపాటు నటన కూడా తగినంత వున్న నటీమణి. ఆమె చెల్లెలు పరిణీతి చోప్రా కూడా హీరోయిన్‌గా…

అక్కా చెల్లెళ్ళు అందంలోనే కాదు, ఆలోచనల్లోనూ అలవాట్లలోనూ పోటీపడుతుంటారు. హిందీ భామ ప్రియాంకా చోప్రా చక్కని చుక్క. అందంతోపాటు నటన కూడా తగినంత వున్న నటీమణి. ఆమె చెల్లెలు పరిణీతి చోప్రా కూడా హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. అక్క కన్నా చెల్లెలు హాట్‌ న్యూస్‌లో ఎక్కువగా నిలుస్తుంటుంది. మీ అక్క అంత స్మార్ట్‌గా వుంటుంది.. నువ్వెందుకు బొద్దుగా వుంటావు.. అని ఒకాయన అడిగితే, ‘నేను కూడా అక్కలాగా పీలగా వుంటే ఏం బాగుంటుంది.. అందుకే కాస్త కండ పెంచాను. 

పైగా అక్కలాగా నా లుక్స్‌ వుండవు లెండి.. అక్క కళ్ళతో కవ్విస్తే నేను ఒళ్ళుతో కవ్విస్తాను. అక్క ఆపిల్‌ జ్యూస్‌ తాగుతుంది. నేను స్ట్రాబెర్రీ జ్యూస్‌ తాగుతాను. అక్క ఆరుగంటలు నిద్రపోతుంది. నేను ఎనిమిది గంటలు నిద్రపోతాను. అక్క జిమ్‌ చేస్తుంది. నేను యోగా చేస్తాను. అక్కకు కోపం తక్కువ.. నాకు ఎక్కువ.. ఇన్ని తేడాలున్నప్పుడు శరీరంలో కూడా తేడాలుండవా.. అక్కకు వేరే మొగుడొస్తాడు.. నాకు వేరేవాడొస్తాడు.. ఇద్దరం ఒక్కడ్ని కట్టుకోం కదా..’’ అని వెటకారం చేస్తున్న పరిణీతి చోప్రా పెద్ద కంచు కదా.!