బాలకృష్ణ 99వ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. ‘లౌక్యం’ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కోన వెంకట్, గోపీమోహన్ సిద్ధం చేసిన కథని శ్రీవాస్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేసిన బాలకృష్ణ ఇందులో తన రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా యంగ్ లుక్‌తో కనిపించబోతున్నారు.
బాలకృష్ణతో అందరూ స్టాండర్డ్ మాస్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో బాలయ్యని కొత్తగా చూపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం బాలకృష్ణ పదిహేను కేజీల బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలం అవుతోంది. ఆ లోటుని ఈ చిత్రం తీర్చనుంది.
బాలకృష్ణ ఏజ్‌కి తగ్గట్టు డిగ్నిఫైడ్‌గా ఉండే క్యారెక్టరే అయినా కానీ కామెడీకి లోటు ఉండదట. వందవ చిత్రం మొదలయ్యే ముందుగా బాలకృష్ణకి కరెక్ట్ ప్రాజెక్ట్ సెట్ అయింది. కోన, గోపీ ఇద్దరూ మోస్ట్ బ్యాంకబుల్ రైటర్స్ అయితే శ్రీవాస్ కూడా ఇంతవరకు ఫెయిలవలేదు. ఈ సినిమా సక్సెస్ అయితే బాలయ్య 100వ సినిమాపై ఉండే హైప్ డబుల్ అవుతుంది కనుక ఇది ‘సూపర్ 99’ అనుకోవాలి.