సోగ్గాడితో ఛాన్స్‌ కొట్టేసింది!

నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో కథానాయికగా ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ లావణ్య త్రిపాటి నటిస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ఈ వార్త ప్రకటించలేదు కానీ ఆమెకి ఇందులో ప్లేస్‌ కన్‌ఫర్మ్‌…

నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో కథానాయికగా ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ లావణ్య త్రిపాటి నటిస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ఈ వార్త ప్రకటించలేదు కానీ ఆమెకి ఇందులో ప్లేస్‌ కన్‌ఫర్మ్‌ అయినట్టే అని తెలిసింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసే ఈ చిత్రానికి కళ్యాణ్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. 

సోలో హీరోగా నటించడానికి ఆసక్తిగా లేని నాగార్జునకి ఈ కథ బాగా నచ్చడంతో కళ్యాణ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో నాగార్జున తాత, మనవడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాత క్యారెక్టర్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుంది. తాత వయసు వచ్చినా అమ్మాయిల వెంట పడేది ఒక క్యారెక్టర్‌ అయితే… ఆడాళ్లని ద్వేషించే పాత్ర మనవడిదట. 

ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.