ఆ రైటర్ తెలివి అద్భుతం!

టాలీవుడ్ లో ఒక రైటర్ ఓ అమ్మాయిని ఇలాగే బుట్టలో వేసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

సినిమా రంగంలో చాలా మంది ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్లు. ఈ వాడకాలు రకరకాలు. డబ్బు రూపంలో, అవసరాలు తీర్చుకోవడంలో. ఇలా రకరకాలుగా.

సినిమాల్లోకి రావాలని, అక్కడ ఒక స్థాయికి చేరాలనే కల చాలా మందికి వుంటుంది. క్రియేటివ్ పీపుల్ అయితే రైటర్లు, డైరక్టర్లు వాడేస్తారు. ఆ వాడకం వేరు. గోస్ట్ లుగా వాడుకోవడం అన్నమాట. అదే అమ్మాయిలు అయితే వేరు. ఆ వాడకం ఏమిటో, ఎలానో చెప్పక్కరలేదు.

టాలీవుడ్ లో ఒక రైటర్ ఓ అమ్మాయిని ఇలాగే బుట్టలో వేసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. డైరక్టర్ తో తనకున్న చనువు, సాన్నిహిత్యం వాడుకుని ఓ అమ్మాయిని సుదూరం నుంచి పిలిపించి సినిమాలో రెండు రోజులు షూటింగ్ లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు షూట్ చేసిన వేషం అంటే ఆనందమే కదా. నిర్మాత సొమ్ము.. రెమ్యూనిరేషన్ అయితేనేం.. షూటింగ్ ఖర్చు అయితేనేం.

కానీ సినిమా తీరా సినిమా విడుదల దగ్గరకు వచ్చేసరికి ఈ సీన్లు అన్నీ సినిమా కథ నడకకు అడ్డం పడుతున్నాయనో, మరోటో చెప్పి, తీసేసినట్లు తెలుస్తోంది. అంటే అవసరం లేని సీన్లు రాయడం.. అవసరం అని చూపించడం.. అవసరం తీరిపోయాక.. తీసేయడం అన్నది అంతా ఓ పెర్ ఫెక్ట్ ప్లాన్ అని తెలుస్తోంది.

మరి ఇంతకీ సినిమా విడుదలయ్యాక, తన సీన్లు లేవేమని నటించిన అమ్మాయి గొడవ పెడితే…? ఏముంది? సింపుల్. ఎడిటింగ్ లో లేచిపోయిందని సర్ది చెప్పడం, మరో సినిమాలో అవకాశం ఇప్పిస్తా అని చెప్పడమే.

5 Replies to “ఆ రైటర్ తెలివి అద్భుతం!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.