ఎట్టకేలకు నాగశౌర్య నుంచి మరో సినిమా ముస్తాబైంది. ఈ హీరో కొత్త సినిమాకు బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పనిలోపనిగా టైటిల్ తో పాటు ఒకేసారి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ లో చేతికి, నుదుటికి రక్తం మరకలతో కనిపిస్తున్నాడు శౌర్య. వ్యాన్ వెనక కూర్చొని బ్యాడ్ బాయ్ లానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో రామ్ అలియాస్ రమేష్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
నాగశౌర్య సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాన్నాళ్లయింది. ఇంకా చెప్పాలంటే, గతేడాది అతడి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ‘రంగబలి’ రిజల్ట్ ఈ హీరో మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసింది. కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకే గ్యాప్ తీసుకున్నాడు.
అయితే తెరపైకి రావడానికి గ్యాప్ తీసుకున్నాడు తప్ప, షూటింగ్స్ కు గ్యాప్ ఇవ్వలేదు. ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ సినిమా షూటింగ్ ను అతడు దాదాపు పూర్తిచేశాడు.
శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విధి హీరోయిన్ గా నటిస్తోంది. హారిష్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు